Vande Bharat Express: తొలిరోజు 21 స్టేషన్లలో ఆగనున్న వందేభారత్ ట్రైన్.. టైమింగ్స్, రేట్స్, ఫీచర్స్ పూర్తి వివరాలు మీకోసం..
దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది. సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే ఈ రైలును వర్చువల్‌గా
దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది. సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడిచే ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా.. అత్యంత సౌకర్యవంతమైన జర్నీ ఈ ట్రైన్ ద్వారా అందిస్తోంది భారత్ ప్రభుత్వం. ఇప్పటి వరకూ నడుస్తున్న వందే భారత్ ట్రైన్లలో కెల్లా అత్యధిక దూరం ప్రయాణించే రైలు కూడా ఇదే. ఇవాళ తొలిరోజు కాబట్టి మొత్తం 21 స్టేషనల్లో ఈ ట్రైన్ ఆగుతుంది. సోమవారం నుంచి సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో మాత్రమే ట్రైన్ ఆగనుంది.
వందే భారత్ స్పెషాలిటీస్..
1. సికింద్రాబాద్ టూ విశాఖ దూరం 698 కిలోమీటర్లు ఉంటుంది.
2. మిగిలిన ట్రైన్స్‌కు 12 గంటలకు పైగానే సమయం పడుతుంది.
3. వందే భారత్ ట్రైన్‌కు పట్టే సమయం 8 గంటల 40నిమిషాలు.
4. వందే భారత్ గరిష్ట వేగ పరిమితి గంటకు 180 కిలోమీటర్లు.
5. సికింద్రాబాద్– విశాఖ మధ్య వేగ పరిమితి 130 కి.మీ.
6. 140 సెకన్లలో గరిష్ట వేగం అందుకోవడం ఈ ట్రైన్ స్పెషాలిటీ.
7. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్‌తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు.
విశాఖ నుంచి టికెట్ రేట్ల వివరాలు..
1. విశాఖ – రాజమండ్రి – ఛైర్ కార్ – రూ. 625 – ఎగ్జిక్యూటివ్ క్లాస్- రూ.1215 2. విశాఖ – విజయవాడ – ఛైర్ కార్ – రూ.960 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.1825 3. విశాఖ – ఖమ్మం – ఛైర్ కార్ – రూ.1115 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.2130 4. విశాఖ – వరంగల్ – ఛైర్ కార్ – రూ.1310 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.2540 5. విశాఖ -సికింద్రాబాద్ – రూ.1720 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ. 3170
సికింద్రాబాద్ నుంచి టికెట్ రేట్ల వివరాలు..
1. సికింద్రాబాద్ – వరంగల్ – ఛైర్ కార్ – రూ.520 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.1005 2. సికింద్రాబాద్ – ఖమ్మం – ఛైర్ కార్ – రూ.750 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.1460 3. సికింద్రాబాద్ – విజయవాడ – ఛైర్ కార్ – రూ.905 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.1775 4. సికింద్రాబాద్ – రాజమండ్రి – ఛైర్ కార్ – రూ.1365 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.2485 5. సికింద్రాబాద్ – విశాఖ – ఛైర్ కార్ – రూ.1665 – ఎగ్జిక్యూటివ్ క్లాస్ – రూ.3120
ఆహారం వద్దంటే రేట్స్ తగ్గుతాయి..
ఈ ట్రైన్‌లో ఛైర్‌కార్‌లో 364, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 419 రూపాయల క్యాటరింగ్ ఛార్జెస్ ఉంటాయి. వీటితో కలిపే టికెట్ విక్రయిస్తారు. ఒకవేల ఆహారం వద్దనుకుంటూ ఆ మేరకు టికెట్ రేట్లు తగ్గనున్నాయి.
ఎనిమిదో ట్రైన్..
ఇప్పటికే ఏడు రైళ్లు పట్టాలెక్కగా, సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు ఎనిమిదో రైలు కేటాయించింది భారత ప్రభుత్వం. తెలుపు వర్ణం, దానిపై నీలి రంగు చారలు, బుల్లెట్ ట్రైన్ తరహాలో లోకో ముందు రూపు, వెడల్పాటి నలుపు రంగు కిటికీ వరస.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ ట్రైన్ డిజైన్ చేశారు.
విశాఖ నుంచి బయలుదేరే టైమింగ్స్ ఇవే..
ఉదయం 5.45కు వైజాగ్‌లో స్టార్ట్ ఉదయం 7.55 గంటలకు రాజమండ్రి ఉదయం 10 గంటలకు విజయవాడ ఉదయం 11 గంటలకు ఖమ్మం మధ్యాహ్నం 12.05 గంటలకు వరంగల్ మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్
సికింద్రాబాద్ నుంచి టైమింగ్స్ ఇవే..
మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో స్టార్ట్ మధ్యాహ్నం 4.35 గంటలకు వరంగల్ మధ్యాహ్నం 5.45 గంటలకు ఖమ్మం సాయంత్రం 7 గంటలకు విజయవాడ రాత్రి 8.50 గంటలకు రాజమండ్రి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం
ఫీచర్స్ అదుర్స్..
వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో 14 ఏసీ చైర్ కార్లు కాగా, రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ ఏసీ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏసీ కార్ కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో 1,128 మంది ప్రయాణం చేయొచ్చు. రెగ్యులర్ బుకింగ్ కింద 806 సీట్లు, తత్కాల్ బుకింగ్ కింద 322 సీట్లు కేటాయించారు. ఇక ఈ రైలుకు ఆటోమేటిక్ తలుపులుంటాయి. వాటి నియంత్రణ లోకో పైలట్ దగ్గర ఉంటుంది. మధ్యలో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు. రైలు ఆగిన కొన్ని క్షణాలకు డోర్లు తెరుచుకుంటాయి. బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందు మూసుకుంటాయి. కోచ్‌లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్‌ప్లే అవుతాయి. లోపల బయట సీసీటీవీ కెమెరాలు ఉటాయి. ట్రైన్ లోపల వైఫై సౌకర్యం కూడా ఉంది. ఎదురుగా రైలొస్తే ఢీ కొట్టకుండా కవచ్ టెక్నాలజీ ఉంది. ప్రతి కోచ్‌లో 4 ఎమర్జెన్సీ లైట్లు ఏర్పాటు చేశారు.
ఔట్ సైడ్ నుంచి అదిరిపోయే లుక్, ఇన్‌సైడ్‌లో ఓ రేంజ్‌లో ఉండే ఫెసిలిటీస్‌తో ఇప్పటికే అందరిని ఆకట్టుకుంటోంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపు దిద్దుకోవడం దీని ప్రత్యేకత. అన్ని రాష్ట్రాలు ఈ రైలును తమ రాష్ట్రానికి రా రమ్మంటూ పట్టాలు పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఈ రైలు కోసం అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..