AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మరణంలోనూ జీవిస్తూ.. చనిపోతూ 8 మందికి జీవితాన్ని ప్రసాదించిన యువకుడు

చదువుకుని ప్రయోజకుడై తన కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న ఆ యువకుడు. విధి వంచనతో అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. కానీ తాను వెళ్తూ వెళ్తూ మరో ఎనిమిది మందికి చూపుని, శ్వాసని, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన నక్కల ఉదయ్ కిరణ్ అవయవ దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు.

Telangana: మరణంలోనూ జీవిస్తూ.. చనిపోతూ 8 మందికి జీవితాన్ని ప్రసాదించిన యువకుడు
Organ Donation
P Shivteja
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 5:44 PM

Share

మరణంలోనూ జీవిస్తూ. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు 22 ఏళ్ల యువకుడు ఉదయ్ కిరణ్. సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు ఉదయ్ కిరణ్ (22) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత ఆశయాలతో హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. రోజూలాగే ఈ నెల 4వ తేదీన కోచింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. నిజాంపేట బస్టాప్‌ వద్ద బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఉదయ్ తలకు తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శనివారం రాత్రి ఉదయ్ కిరణ్ ‘బ్రెయిన్ డెడ్’ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, ఉదయ్ కిరణ్ తల్లిదండ్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ కొడుకు భౌతికంగా లేకపోయినా, అతని అవయవాల ద్వారా మరికొందరిలో బతకాలని భావించారు.

జీవన్ దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్‌తో అవయవదానానికి అంగీకరించారు. ఉదయ్ కిరణ్ నుంచి సేకరించిన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు ఇలా మొత్తం 8 మందికి అమర్చి వారికి పునర్జన్మను ఇచ్చారు. ఆదివారం ఉదయ్ కిరణ్ స్వగ్రామమైన కొత్లాపూర్‌లో కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఆశయాల బాటలో పయనిస్తూ అర్ధాంతరంగా తనువు చాలించినా.. ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఈ యువకిరణం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. ప్రత్యర్థులకు ఇక వణుకే..!
సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. ప్రత్యర్థులకు ఇక వణుకే..!
ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌..
ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌..
అలసటను తగ్గించడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది..?
అలసటను తగ్గించడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజుల పాటు మాడు పగిలే ఎండలు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజుల పాటు మాడు పగిలే ఎండలు
శ్మశానం పక్కనే హాస్టల్.. OTTలోకి వచ్చేసిన రీసెంట్ హారర్ థ్రిల్లర్
శ్మశానం పక్కనే హాస్టల్.. OTTలోకి వచ్చేసిన రీసెంట్ హారర్ థ్రిల్లర్
జాబ్ వచ్చిందని యూరప్ ఫ్లైట్ ఎక్కబోతుండగా షాక్..!
జాబ్ వచ్చిందని యూరప్ ఫ్లైట్ ఎక్కబోతుండగా షాక్..!
యుద్ధ మేఘాల మధ్య పసిడికి కష్టాలు.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి
యుద్ధ మేఘాల మధ్య పసిడికి కష్టాలు.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి
చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? వీటిని తినడం బంద్ చేయండి..
చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? వీటిని తినడం బంద్ చేయండి..
విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల!
విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల!
వేసవిలో కోసిన పండ్ల ద్వారా వచ్చే ఈ వ్యాధుల గురించి మీకు తెలుసా?
వేసవిలో కోసిన పండ్ల ద్వారా వచ్చే ఈ వ్యాధుల గురించి మీకు తెలుసా?