AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అనుమానాస్పదంగా కనిపించిన డీసీఎం వాహనం.. లోపల చెక్‌ చేయగా..!

రంగారెడ్డి జిల్లాలో 1000 కిలోల శ్రీగంధం చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో దాదాపు 30-35 లక్షల విలువైన శ్రీగంధం స్వాధీనం చేసుకున్నారు.

Video: అనుమానాస్పదంగా కనిపించిన డీసీఎం వాహనం.. లోపల చెక్‌ చేయగా..!
Smuggling
Noor Mohammed Shaik
| Edited By: SN Pasha|

Updated on: Jul 03, 2025 | 5:53 PM

Share

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ గురించి పుష్ప అనే ఓ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినియా సక్సెస్ విషయం పక్కనపెడితే.. ఆ సినిమాలో ఎర్ర చందనం దుంగలను పోలీసులకు చిక్కుకుండా, ఎవరికీ అనుమానం రాకుండా పలుపలు విధాలుగా స్మగ్లింగ్‌ చేస్తాడు హీరో. పాల వాహనంలో కిందంతా ఎర్ర చందనం పెట్టి.. పైన పాల ట్యాంక్‌ పెట్టి ఎంచక్కా పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ దాటిస్తుంటాడు. ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ.. రియాల్‌గా కూడా అలాంటి చీప్‌ స్మగ్లింగ్‌ ఐడియాలు ఫాలో అవుతూ.. ఓ స్మగ్లింగ్‌ ముఠా పోలీసులకు చిక్కింది. వెయ్యి కిలోల శ్రీగంధం (తెల్ల గంధం) దుంగలు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపూర్ గ్రామ శివారులో పక్క సమాచారంతో మాదాపూర్ యస్ఓటీ, చేవెళ్ల పోలీసుల ఆధ్వర్యంలో ఈ స్మగ్లింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని హంట్వాడి గ్రామం నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్ గూడ గ్రామంలోనీ ఆంధ్ర ఫర్ప్యూమ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్న 1000 కిలోల శ్రీగంధం (తెల్ల గంధం) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.30 నుంచి రూ.35 లక్షల రూపాయలు ఉంటుందని చేవెళ్ల ఏసీపీ కిషన్ తెలిపారు. గంధం చెక్కలను తరలిస్తున్న MH25 AJ 3689 నంబర్ గల డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో క్యాబిన్‌ వెనుక చిన్న గదిలా ఏర్పాటు చేసి.. అందులో శ్రీగంధం చెక్కలు బస్తాల్లో పెట్టి ఉంచారు.

ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో డ్రైవర్ అబ్దుల్ అజీజ్, సూపర్వైజర్ సోహెబ్, రైతు విజయ్ హనుమంత్ మానె ఉన్నారు. ఫ్యాక్టరీ ఓనర్ అబ్దుల్ కుర్వి, మేనేజర్ సిద్దిక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న నిందితులను రిమాండ్ కు తరలించారని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మాదాపూర్ ఎస్ఓటీ సీఐ సంజయ్, ఎస్ఐ లు సతీష్, అజయ్, సిబ్బంది, రవి కుమార్ ఫారెస్ట్ అధికారి, చేవెళ్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు