Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Notifications 2025: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన..

TGPSC Notifications 2025: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!
TGPSC to issue job notifications
Srilakshmi C
|

Updated on: Jul 03, 2025 | 5:17 PM

Share

హైదరాబాద్‌, జులై 3: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీజీపీఎస్సీ సమాయాత్తమవుతోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ ఇప్పటికే టీజీపీఎస్సీకి అందించింది. నిజానికి, పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఈఓలు, ప్రభుత్వ డైట్, బీఈడీ కళాశాలలు, ఎస్‌సీఈఆర్‌టీలోని అధ్యాపకులు, సీనియర్‌ అధ్యాపకులతోపాటు మొత్తం 134 పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ 2022లోనే అనుమతి ఇచ్చింది.

ఇందులో 24 డిప్యూటీ ఈఓ, 110 అధ్యాపక, సీనియర్‌ అధ్యాపక పోస్టులు ఉన్నాయి. ఈ 134 పోస్టులతో పాటు తాజాగా దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీల్లో 8 ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్‌కు ప్రతిపాదనలు అందాయి. మొత్తంగా 142 పోస్టులకు త్వరలోనే 5 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఉమ్మడి తెలంగాణ పరిధిలో మొత్తం 72 డిప్యూటీ ఈఓ పోస్టులు ఉండేవి. ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున గతంలో కేటాయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు రెండే ఉన్నప్పటికీ.. జనాభా, పాఠశాలలు సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌ ఒక్క జిల్లాకే ఏకంగా 12 పోస్టులు రానున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లు పెరిగాయి. దీంతో 28 పోస్టులను మంజూరు చేయాలని 2 రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం 33 జిల్లాలకు కలిపి కేవలం 12 డీఈఓ పోస్టులే ఉన్నాయి. అదనంగా మరో 21 పోస్టులను మంజూరు చేయాలనీ ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా త్వరలోనే 28 డిప్యూటీ ఈఓ, 21 డీఈఓ పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.