AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎండకు బీర్లు గటగటా తాగేస్తున్నారు.. రికార్డ్ రేంజ్‌కు చేరిన సేల్స్

తెలంగాణలో బీర్లు పొంగిపొర్లుతున్నాయి. మద్యం ప్రియులు బాటిల్ మీద బాటిల్‌ ఎత్తి తెగ లాగించేస్తున్నారు. ఎండలు పెరిగితే మనకేంటి.. చిల్డ్ బీరేసి చిందెయ్‌రా.. అంటున్నారు తెలంగాణలో మందుబాబులు. రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్న బీర్ సేల్సే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

Telangana: ఎండకు బీర్లు గటగటా తాగేస్తున్నారు.. రికార్డ్ రేంజ్‌కు చేరిన సేల్స్
Beer
Ram Naramaneni
|

Updated on: May 21, 2023 | 6:13 PM

Share

ప్రజంట్ పీక్ సమ్మర్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎండలు మండిపోతున్నాయి. దీంతో తెలంగానలో మందుబాబులు బీర్లు తెగ తాగేస్తున్నారు. మే నెల 1 వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రికార్డు రేంజ్‌లో బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ 18 రోజుల్లో 583 కోట్ల రూపాయలు విలువ చేసే బీర్లు తాగేశారట మందుబాబులు. మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడైనట్లు డేటా చెబుతుంది. ఈ లెక్కన మే నెల ముగిసే టైమ్‌కి ప్రభుత్వ ఖజానాకు కేవలం బీర్లు అమ్మకాల ద్వారానే వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ఇక బీర్ సేల్స్‌లో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా టాప్. ఈ జిల్లాలో 48.14 కోట్ల విలువైన బీర్లు తాగేశారు. ఇక కరీంనగర్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఓవైపు ముదిరిన ఎండలతో పాటు..  పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.  రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో బీర్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా లిక్కర్ షాపులకు నిత్యం బీరు సరఫరా అవుతోంది. దీంతో ఈ నెలలో బీర్ల విక్రయాలు రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. జర భద్రం సోదరా..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!