AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపులో ఉన్నది అమ్మాయి అని తేలింది.. కట్ చేస్తే.. గుట్టుగా ఆర్ఎంపీ అబార్షన్.. పాపం గర్భిణి

కనడానికి ఆమె కావాలి.. అమ్మ అనడానికి ఆమె కావాలి. సహచర్యానికి ఆమే కావాలి.. కానీ కడుపులో పుట్టడానికి ఆమె వద్దు. ఇప్పటికీ కొంతమంది పురిట్లోనే ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. బంగారు తల్లులను భూమి మీదికి రాకుండా కడుపులోనే కడతేరుస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు మాఫియాగా ఏర్పడి యధేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు.

కడుపులో ఉన్నది అమ్మాయి అని తేలింది.. కట్ చేస్తే.. గుట్టుగా ఆర్ఎంపీ అబార్షన్.. పాపం గర్భిణి
Suryapet Crime News
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 18, 2025 | 10:32 AM

Share

కనడానికి ఆమె కావాలి.. అమ్మ అనడానికి ఆమె కావాలి. సహచర్యానికి ఆమే కావాలి.. కానీ కడుపులో పుట్టడానికి ఆమె వద్దు. ఇప్పటికీ కొంతమంది పురిట్లోనే ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. బంగారు తల్లులను భూమి మీదికి రాకుండా కడుపులోనే కడతేరుస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు మాఫియాగా ఏర్పడి యధేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. తాజాగా ఆర్‌ఎంపీ చేసిన అబార్షన్ వికటించి తెలంగాణలో ఓ నిండు ప్రాణం బలైంది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్లకు చెందిన విజేత, వెంకన్న దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇటీవల మరోసారి విజేత గర్భం దాల్చింది. తుంగతుర్తిలో శ్రీ సాయి బాలాజీ హాస్పిటల్ పేరుతో శ్రీనివాస్ RMP వైద్యుడిగా కోనసాగుతున్నాడు. కొంత కాలంగా శ్రీనివాస్ గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదు నెలల గర్భిణీ విజేతకు కుటుంబ సభ్యులు శ్రీనివాస్ తో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో ఆడ శిశువుగా తేలింది.

దీంతో ఆర్ఎంపి వైద్యుడు శ్రీనివాస్ తన హాస్పిటల్ లో గర్భిణి విజేతకు అబార్షన్ చేశాడు.. అయితే.. అది వికటించి అధిక రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమెకు వైద్యం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా గర్భిణి విజేత మృతి చెందింది. దీంతో ఆర్ఎంపి వైద్యుడు శ్రీనివాస్ పరారయ్యాడు.

గర్భిణీ విజేత మృతికి ఆర్ఎంపి వైద్యుడు శ్రీనివాస్ కారణమంటూ తుంగతుర్తిలోని అతడి హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. గర్భిణీ మృతిపై సుమోటోగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణ చేపట్టింది. గర్భిణీ మృతిపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. జిల్లాలో అర్హత లేని వైద్యులు, ఆసుపత్రులు నిర్వహిస్తూ.. వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..