Revanth reddy: హైదరాబాద్‌ చేరుకున్న రేవంత్‌ రెడ్డి.. మరికాసేపట్లో..

రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా ఆయనకు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇక డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్‌ శాండిల్యా.. రేవంత్‌ రెడ్డిని కలిసి, పుష్పగుచ్చాన్నారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు...

Revanth reddy: హైదరాబాద్‌ చేరుకున్న రేవంత్‌ రెడ్డి.. మరికాసేపట్లో..
Revanth Reddy
Follow us

|

Updated on: Dec 07, 2023 | 6:53 AM

సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో రేవంత్‌ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ సీనియర నేతలు.. శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, బలరామ్‌ నాయక్‌, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.

రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా ఆయనకు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇక డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్‌ శాండిల్యా.. రేవంత్‌ రెడ్డిని కలిసి, పుష్పగుచ్చాన్నారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎల్టీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది.

భారీ ఎత్తున చేపడుతోన్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లక్షకుపైగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఇక రేవంత్‌ రెడ్డి తొలి సంతకం ఆర గ్యారెంటీలపై చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నాయకులతో సమావేశమైన రేవంత్‌.. మంత్రి వర్గం గురించి చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ముఖ్యమంత్రి కాకుండా మొత్తం 17 మందికి మంత్రి వర్గంలో అవకాశం ఉండగా.. ప్రస్తుతం పాక్షికంగా 8 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాలని, తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలనే ప్రతిపాదన ఏఐసీసీ నాయకులు, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో వచ్చినట్లు తెలిసింది. కానీ అధిష్ఠానం మాత్రం పూర్తిస్థాయి మంత్రివర్గంతోనే వెళ్లమని సూచించినట్లు తెలిసింది.

దీపేందర్‌ సింగ్‌ తల్లి ఆశ్వీర్వాదం తీసుకున్న రేవంత్‌..

ఇక బుధవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ నేత దీపేందర్‌ సింగ్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా దీపెందర్‌ తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నార. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని రేవంత్‌ కోరారు. ఈ సమయంలో హుడా తల్లి… రేవంత్ రెడ్డికి తిలకం దిద్ది ఆశీర్వదించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు