ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. పోటీపరీక్షలకు ఉచిత తరగతులు..

కలలు కనండి సాకారం చేసుకోండి అని ఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం ఇచ్చిన నినాదం. అయితే కలలు కంటున్న విద్యార్థులను లక్ష్యంవైపు తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. సింగరేణి కార్మికుని ఇంట పుట్టిన ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)కు ఎంపికై బీఎస్ఎన్ఎల్‎లో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు. ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు లక్ష్యం వైపునకు అడుగులు వేయలేకపోతున్నారని గమనించిన చింతల రమేష్ యువత చింతను దూరం చేస్తున్నారు.

ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. పోటీపరీక్షలకు ఉచిత తరగతులు..
Rtd.ies Officer
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 25, 2024 | 8:12 PM

కలలు కనండి సాకారం చేసుకోండి అని ఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం ఇచ్చిన నినాదం. అయితే కలలు కంటున్న విద్యార్థులను లక్ష్యంవైపు తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. సింగరేణి కార్మికుని ఇంట పుట్టిన ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)కు ఎంపికై బీఎస్ఎన్ఎల్‎లో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు. ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు లక్ష్యం వైపునకు అడుగులు వేయలేకపోతున్నారని గమనించిన చింతల రమేష్ యువత చింతను దూరం చేస్తున్నారు. ఆర్థిక పరిపుష్టి పొందాలన్న తపనతో కాకుండా.. నేటి తరాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. పుట్టింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అయితే.. చదువంతా కరీంనగర్‎లోనే కొనసాగించారాయన. కొంతకాలం వరంగల్ ఎస్ఆర్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‎గా పని చేసిన రమేష్ ఐఈఎస్‎కు ఎంపికై బీఎస్ఎన్ఎల్‎లో జూనియర్ టెలికాం ఆఫీసర్‎గా సెలెక్ట్ అయ్యారు. కొంతకాలమే ఉద్యోగంలో కొనసాగి పదవీవిరమణ చేసిన ఆయన 2019లో కరీంనగర్‎లో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు.

ఇందులో ప్రభుత్వ ఐఐటీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగం సాధించడమెలా అన్న విషయాలపై పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని ట్రిపుల్ ఐటీల్లో చదువుకున్న విద్యార్థులకు ఫిజికల్ కోచింగ్ ఇస్తు వారి జీవితాలకు బంగారు బాట వేస్తున్నారు. తొలి ప్రయత్నంలో తన చింతల రమేష్ ఇనిస్ట్యూట్‎లో కోచింగ్ తీసుకున్న ఇద్దరు కూడా ఉద్యోగాలు పొందారు. వీరిలో ఒక అమ్మాయి ఐఈఎస్‎లోఆల్ ఇండియా 10వ ర్యాంకు సాధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‎లో సైంటిస్ట్‎గా పని చేస్తున్నారు. మరో అబ్బాయి 527 ర్యాంకు సాధించి మీడియా టెక్ కంపెనీలో రూ. 25 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నారు. ఆ తరువాత సంవత్సరం నుండి చింతల రమేష్ వద్ద శిక్షణ పొందిన వారిలో 20 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగా, మరో 25 మంది వరకు వివిధ కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు. బ్యాచుకు 30 మందిని చేర్చుకోవాలని అనుకున్నప్పటికీ 50 మంది వరకు విద్యార్థులు ఆసక్తి చూపడంతో వారికి మెలుకువలు నేర్పుతు తర్ఫీదు ఇస్తున్నారు. ఆఫ్ లైన్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా.. స్టడీ మెటిరియల్ కూడా ఫ్రీగానే అందిస్తున్నారు.

ఐఈఎస్‎కు ఎంపికై బీఎస్ఎన్ఎల్‎లో ఉన్నతస్థాయి అధికారిగా పదోన్నతులు పొందుతూ దర్జాగా కాలం వెల్లదీయాల్సిన చింతల రమేష్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అసలు కారణం వేరే ఉంది. ఐఈఎస్ సాధించిన తాను అలాంటి జీవనం గడిపితే తన కుటుంబం మాత్రమే బావుంటుంది. కానీ.. ఉద్యోగాల అన్వేషణలో నిరుత్సాహానికి గురై.. ప్రిపరేషన్ కావడంలో ఢీలా పడిపోయి.. చతకిలపడిపోతున్న యువతలో నూతనోత్సాహం నింపాలన్న ఒకేఒక్క సంకల్పమే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు పురికొల్పింది. దీంతో చదువు కొనడం కాదు.. చదువుకోవడం ముఖ్యం అన్న నానుడిని నిజం చేస్తున్నారు. సాంకేతికపరమైన అవగాహన ఉన్నా సక్సెస్ కాలేకపోతున్న వారు కొందరు.. బేసిక్ నాలెడ్జీ చాలినంత లేక మరికొందరు.. కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేక జీవితం స్థిరపడలేకపోతున్నారన్న విషయాన్ని గమనించారు రమేష్‌. తాను తన కుటుంబం కోసం మాత్రమే జీవిస్తే సరిపోదని.. నేటి తరాన్ని అన్నింటా తయారు చేయాల్సిన అవసరం ఉందని గమనించారు. ఈ కారణంగానే రమేష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిమరి యువతకు దిశానిర్దేశం చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

కోవిడ్ లాక్ డౌన్ కారణంగా పిజికల్ క్లాసులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆన్ లైన్‎లో కోచింగ్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత యథావిధిగా ఆఫ్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆన్ లైన్ క్లాసులను కూడా నిర్వహిస్తున్న రమేష్.. బీటెక్ చదువుకుంటున్న వారికి మాత్రమే కోచింగ్ ఇస్తున్నారు. అటు బీటెక్ చేస్తూ ఇటు ప్లేస్‎మెంట్ పొందే విధంగా స్టూడెంట్స్‎ను సుశిక్షితులను చేస్తున్నారు. ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న వారి నుండి మాత్రం ఏడాదికి రూ. 615 నామ మాత్రపు ఫీజు వసూలు చేస్తున్నారు. తన హితులు, సన్నిహితులు, స్నేహితులు అంతా వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో తన లక్ష్యం వైపు సాగుతున్నానని అంటున్నారు. విద్య అందుకోవడం గొప్పతనం కాదని.. పట్టాలు పొందిన తరువాత ఉద్యోగాలు చేయడం అత్యంత ముఖ్యమన్న విషయాన్ని గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు
ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు
యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు
యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు
సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..
గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..
హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..
హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..
మటన్ కూర్మా ఇలా చేశారంటే.. టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది..
మటన్ కూర్మా ఇలా చేశారంటే.. టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది..
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. ఎప్పటినుంచంటే?
ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. 2 లక్షల కోట్లతో..
ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. 2 లక్షల కోట్లతో..
రామ్ చరణ్ కి తీరక లేకుండా చేస్తున్న ఫ్యాన్స్. ఫుల్ ఫోకస్ దానిమీదే
రామ్ చరణ్ కి తీరక లేకుండా చేస్తున్న ఫ్యాన్స్. ఫుల్ ఫోకస్ దానిమీదే
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!