AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Services: తెలంగాణలో జోరుగా విస్తరిస్తున్న 5జీ సేవలు… కొత్తగా మరో 14 పట్టణాల్లో..

టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన జియో 5జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రధాన పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో తాజాగా చిన్న పట్టణాలకు సైతం 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 33 నగరాల్లో...

5G Services: తెలంగాణలో జోరుగా విస్తరిస్తున్న 5జీ సేవలు... కొత్తగా మరో 14 పట్టణాల్లో..
5g Services
Narender Vaitla
|

Updated on: Apr 13, 2023 | 6:24 PM

Share

టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన జియో 5జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రధాన పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో తాజాగా చిన్న పట్టణాలకు సైతం 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 33 నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా మరో 14 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. కొత్తగా జియో 5జీ సేవలు కామారెడ్డి, మిర్యాలగూడ, పాల్వంచ, గద్వాల, ఆర్మూర్, సిరిసిల్ల, భువనగిరి, బోధన్, వనపర్తి, బెల్లంపల్లి, కాగజ్ నగర్, పెద్దపల్లి, కోరుట్ల, మందమర్రి నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

తెలంగాణ వ్యాప్తంగా, ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్, సూర్యాపేటలో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన 14 నగరాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో కసరత్తులు చేస్తోంది.

ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో జియో ట్రూ 5జీని మరో 14 నగరాలకు విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంద’ని చెప్పుకొచ్చారు. కొత్త 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి 14 నగరాల్లో జియో వినియోగదారులకు జియో వెల్‌కమ్‌ ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ + వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..