TS Online Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్.. మళ్లీ ఎప్పుడు ప్రారంభం కానున్నాయంటే..
Registrations in Telangana: తెలంగాణలో నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర డాటా సెంటర్‌లో కొత్త యూపీఎస్ ఏర్పాటు కారణంగా రిజిస్ట్రేషన్ సేవలకు

Registrations in Telangana: తెలంగాణలో నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర డాటా సెంటర్‌లో కొత్త యూపీఎస్ ఏర్పాటు కారణంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. నిన్న సాయంత్రం నుంచే ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్లు తిరిగి సోమవారం ప్రారంభం కానున్నాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ చేపట్టే రిజిస్ట్రేషన్ల కార్డు పోర్టల్ గచ్చిబౌలిలోని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్‌కు అనుసంధానమై ఉంది. దీనిని 2011లో ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ శాఖల్లోని వివిధ అప్లికేషన్లకు, వెబ్‌సైట్లకు ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నది. అయితే ఎస్‌డీసీలో మెరుగైన పవర్ బ్యాకప్ పవర్ కోసం శుక్రవారం నుంచి కొత్త యూపీఎస్ ఏర్పాటు పనులు జరుగనున్నాయి.
తరచూ సేవల్లో కలుగుతున్న అసౌకర్యాలను నివారించేందుకు.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్‌లో కొత్త యూపీఎస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌డీసీ నిలిచిపోనుండటంతో రిజిస్ట్రేషన్ల కార్డు పోర్టల్ కూడా పని చేయదు. దీంతో ఈ రోజు రాష్ట్రంలోని 141 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రకియ నిలిచిపోనుంది. మళ్లీ సోమవారం నుంచి యధావిధిగా అన్ని ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Also Read:
