AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: స్కూల్ పిల్లలతో రాహుల్ గాంధీ రన్.. తెలంగాణలో రాహుల్‌ జోడో యాత్ర ఫుల్‌ జోష్‌

అదే జోరు-అదే హోరు-అదే ఉత్సాహం. తెలంగాణలో ధూంధాంగా సాగుతోంది రాహుల్‌ జోడో యాత్ర. ఒకవైపు ప్రత్యర్ధులపై పొలిటికల్‌ బాంబులు పేల్చుతూనే... మరోవైపు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఏదో రొటీన్‌గా నడిచి వెళ్లిపోకుండా... దారి పొడవునా ఇంట్రెస్టింగ్‌ సీన్స్‌తో పాదయాత్రను రక్తికట్టిస్తున్నారు రాహుల్‌గాంధీ.

Rahul Gandhi: స్కూల్ పిల్లలతో రాహుల్ గాంధీ రన్.. తెలంగాణలో రాహుల్‌ జోడో యాత్ర ఫుల్‌ జోష్‌
Rahul Gandhi
Sanjay Kasula
|

Updated on: Oct 30, 2022 | 9:40 PM

Share

తెలంగాణలో రాహుల్‌ జోడో యాత్ర ఫుల్‌ జోష్‌తో సాగుతోంది. అన్ని వర్గాలతో మమేకమవుతోన్న రాహుల్‌గాంధీ… ప్రొఫెసర్లు, మేధావులు, విశ్లేషకులతో మాట్లాడి, తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఏం చేయాలో చెప్పండి అంటూ సూచనలు సలహాలు తీసుకుంటున్నారు రాహుల్‌. బీజేపీ అండ్‌ టీఆర్‌ఎస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు రాహుల్‌. రెండు పార్టీలూ ధన రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఫైరయ్యారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌… రెండూ ఒక్కటేనన్న రాహుల్… దేశంలో బీజేపీ… తెలంగాణలో టీఆర్‌ఎస్ అరాచక పాలన సాగిస్తున్నాయంటూ హాట్‌ కామెంట్స్ చేశారు.

రాహుల్‌తో కలిసి నడవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే, రాహుల్‌తో నడక అంటే జస్ట్‌ వాకింగ్‌ కాదు, పరుగులు పెట్టాల్సిందే. అంత స్పీడ్‌గా నడుస్తున్నారు రాహుల్‌గాంధీ. ఒక్కోసారి రన్‌ రాజా రన్‌ అంటూ పరుగు అందుకుంటోన్న రాహుల్‌ ఫిట్‌నెస్‌ను చూసి అవాక్కవుతున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌ అండ్ పబ్లిక్‌.

పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. స్కూల్ పిల్లలతో కలిసి రేస్ లో పాల్గొన్నారు. చిన్న పిల్లల రేసును నడిపిద్దాం? సవాల్‌ని స్వీకరించి వారితో పరుగుతీశాడు. గుంపు మధ్యలో నుండి ఎవరో “రేస్ లగాగే?” అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి రాహుల్ పరుగు పరుగున సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కామన్‌ పీపుల్‌. పిల్లలు, పెద్దలు, రైతులు, కార్మికులు, ప్రజా సంఘాలతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు రాహుల్‌గాంధీ. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ధూంధాంగా సాగుతోంది రాహుల్‌ జోడో యాత్ర.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ ఈ ఉదయం ఇక్కడి నుంచి పాదయాత్రను పునఃప్రారంభించారు. 22 కి.మీ మేర సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో 5 రోజుల భారత్ జోడో యాత్ర నేటితో ముగిసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో