Congress BC Declaration: కాంగ్రెస్‌ హైకమాండ్‌కి ఆర్‌ కృష్ణయ్య నాలుగు డిమాండ్లు.. అవేంటో తెలుసా..?

Congress BC Declaration: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్‌.. వరుస డిక్లరేషన్‌లు ప్రకటిస్తూ వస్తోంది. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్.. ఆ తర్వాత యూత్ డిక్లరేషన్, చేవెళ్ల వేదికగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ను ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్.. బీసీ డిక్లరేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి తుది డ్రాఫ్ట్ సిద్ధం చేస్తోంది.

Congress BC Declaration: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్‌.. వరుస డిక్లరేషన్‌లు ప్రకటిస్తూ వస్తోంది. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్.. ఆ తర్వాత యూత్ డిక్లరేషన్, చేవెళ్ల వేదికగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ను ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్.. బీసీ డిక్లరేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి తుది డ్రాఫ్ట్ సిద్ధం చేస్తోంది. బీసీ డిక్లరేషన్ విడుదల చేసేందుకు టీపీసీసీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కూడా ఆహ్వానించింది. అధికారంలోకి వచ్చేందుకు వ్యూహంతో ముందుకు వెళ్తోన్న కాంగ్రెస్.. అత్యధికంగా ఉన్న బీసీలకు పలు హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీట్లతో పాటు.. బీసీలకు ఆర్థిక చేయూత, అభివృద్ధి పథకాలను అందించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. బీసీ డిక్లరేషన్ ప్రకటనకు ముందు బీసీ నేత, వైసీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పలు సూచనలు చేశారు. బీసీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్‌ హైకమాండ్‌కి సూచనలు చేయడంతోపాటు.. నాలుగు డిమాండ్లను వారి ముందుంచడంతోపాటు.. రాత పూర్వకంగా హామీనివ్వాలని కోరారు.

కాంగ్రెస్‌ ముందు ఆర్‌.కృష్ణయ్య ఉంచిన డిమాండ్లు..

1: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తేవాలి!
2: బీసీల కోసం కేంద్రంలో మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
3: బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్లు కేటాయించాలి
4: విద్యాఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలి
5: బీసీ డిక్లరేషన్‌ అమలుపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్‌

ఇవి కూడా చదవండి

కృష్ణయ్య సూచనల అనంతరం కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను విస్మరిస్తే ఏ పార్టీకైనా, ఏ లీడర్‌కైనా మనుగడే ఉండదని హెచ్చరించారు. బలహీనవర్గాలకు దక్కాల్సిన వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే.. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ క్రమంలో అన్ని డిక్లరేషన్ లను పార్టీ త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

నిన్న స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి దీనిపై చర్చించగా.. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల ప్రస్తావన వచ్చింది. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాదన కూడా జరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..