Telangana: వర్షపాతంలో ఆగస్టు నెల రికార్డ్ ఇదే.. 2002 జూలై తర్వాత తొలిసారిగా..
Telangana Weather Report: వర్షాలు లేక వాతావరణం ఈ స్థాయిలో పొడిగా మారటానికి కొన్ని కారణాలు చెబుతున్నారు. బలహీనమైన రుతుపవనాల పరిస్థితులు నెల రోజులుగా కొనసాగుతున్నాయి. జూన్-సెప్టెంబర్ లలో 10% కంటే ఎక్కువ కొరత ఉన్న వర్షపాతం లోటు ఈసారి అధికంగా ఉంది. ఒక మంగళవారం రోజు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 9 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ లో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు ఆశిస్తున్నారు.బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం..
తెలంగాణ, ఆగస్టు 30: సాధారణంగా జూలై మాసం వచ్చిందంటే చాలు వర్షాకాలం మొదలైనట్టే భావిస్తారు. జూలై నుండి ఆగస్టు వరకు ప్రతి సంవత్సరం వర్ష పాతం ఎక్కువగా నమోదయ్యే నెలలు.. గత రీకార్డ్‌లను ఓ సారి చూస్తే ఆగస్టు నెలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఆగస్టు నెల మాత్రం సాధారణ వర్షపాతం కంటే 33 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షపాతం 241 మి.మి. నమోదు కావల్సి ఉంది. కానీ కేవలం 160.3 మిమి. వర్షపాతం మాత్రమే నమోదు అయింది. అత్యంత పొడి నెలగా ఆగస్టు మాసం ఉండిపోయింది. 2005లో అత్యంత పొడి ఆగస్టుగా నమోదయింది. అప్పటి వర్షపాతం 191.2 మి.మి. అప్పట్లో 25 శాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదయింది. కానీ ఈ ఆగస్టులో కనీసం 170 నుండి మిమి. వర్షపాతం కంటే ఎక్కువ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఆగస్ట్‌లో 30 శాతం కంటే వర్షపాతం లోటు రావడం ఇదే మొదటిసారి అంటున్నారు నిపుణులు.
వర్షాలు లేక వాతావరణం ఈ స్థాయిలో పొడిగా మారటానికి కొన్ని కారణాలు చెబుతున్నారు. బలహీనమైన రుతుపవనాల పరిస్థితులు నెల రోజులుగా కొనసాగుతున్నాయి. జూన్-సెప్టెంబర్ లలో 10 శాతం కంటే ఎక్కువ కొరత ఉన్న వర్షపాతం లోటు ఈసారి అధికంగా ఉంది. ఒక మంగళవారం రోజు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 9 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ లో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు ఆశిస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నందున సెప్టెంబర్ 2 నుండి వాతావరణంలో మార్పులు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.. ఇది అల్పపీడనంగా మారి తూర్పు, దక్షిణ, సెంట్రల్ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండి చీఫ్ తెలిపారు.
సుమారు 105 సంవత్సరాల తర్వాత సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైన వర్షపాతాల్లో ఈ ఆగస్ట్ రెండవది.. గడిచిన కొన్ని సంవత్సరాలు రికార్డు చూస్తే 2002 జూలైలో 50.6 లోటులో వర్షపాతం నమోదయింది. ఆ తరువాత ఈ ఆగస్ట్ లోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయింది. జూలై ఆగస్టు నెలలో వ్యవసాయానికి అత్యంత కీలకమైనవి. ఈ రెండు మాసాల్లో అత్యంత ఎక్కువ తేమ ఉంటుంది. అయితే ఆశ్చర్యంగా జూలైలో మాత్రం దేశవ్యాప్తంగా 315.9 మీమి సగటు వర్షపాతం నమోదయింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 13% ఎక్కువగా వర్షపాతం నమోదయింది. ఆగస్టులో 6 నుండి 10 శాతం లోటుతో సాధారణం కంటే తక్కువ రుతుపవనాలను వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబర్ లో వర్షపాతం ఆగస్టు కంటే మెరుగ్గా ఉంటుందని నిపుణులు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడవచ్చు అని వాతావరణ నమూనాలు చూపిస్తున్నాయి. మొత్తం భారతదేశం కాకుండా కేవలం సెంట్రల్ ఇండియాలో మాత్రమే దీని ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తం మీద సెప్టెంబర్‌లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.