AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కర్రతో కొట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి.. ఉరివేసి దారుణంగా భార్యను చంపిన భర్త.. అసలు ఏం జరిగిందంటే ?

ఈ మధ్య కుటుంబ హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసలు చూడకుండా.. ఒకరినొకరు హత్యలు చేసుకునే ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను అత్యంతా కిరాతంగా హత్య చేయడం కలకలం రేపింది. భార్యను కర్రతో కొట్టి, కరెంట్ షాక్ ఇచ్చి.. ఆ తర్వాత ఉరి వేసి మరీ చంపేసి తన రక్షతత్వాన్ని చూపాడు భర్త. ఈ అత్యంత దారుణమైన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రంగరాయిగూడె శివారు అయిన కాశీంనగర్‌లో బుధవారం రోజున జరిగింది.

Telangana: కర్రతో కొట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి.. ఉరివేసి దారుణంగా భార్యను చంపిన భర్త.. అసలు ఏం జరిగిందంటే ?
Death
Aravind B
|

Updated on: Aug 30, 2023 | 4:39 PM

Share

ఈ మధ్య కుటుంబ హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసలు చూడకుండా.. ఒకరినొకరు హత్యలు చేసుకునే ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను అత్యంతా కిరాతంగా హత్య చేయడం కలకలం రేపింది. భార్యను కర్రతో కొట్టి, కరెంట్ షాక్ ఇచ్చి.. ఆ తర్వాత ఉరి వేసి మరీ చంపేసి తన రక్షతత్వాన్ని చూపాడు భర్త. ఈ అత్యంత దారుణమైన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రంగరాయిగూడె శివారు అయిన కాశీంనగర్‌లో బుధవారం రోజున జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ వ్యక్తి తన భార్యను ఇంత దారుణంగా హత్య చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని కాశీంగూడెంకు చెందిన కాశీం అనే వ్యక్తి మదారిబీ అనే మహిళ దంపతులు.

అయితే వారి వారి పెద్ద కూతురు హజరత్ అనే అమ్మాయిని తొర్రుర్ మండలం హరిపిరాల గ్రామానికి చెందిన గాంధారీ, ఫాతిమాబీ దంపతుల కుమారుడైన అమీర్‌కు ఇచ్చి పెళ్లి జరిపించారు. అయితే వీరిద్దరు పెళ్లి తర్వాత బతుకుదెరువు కోసం.. స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రంగరాయిగూడెం గ్రామ శివారులోని కాశీంనగర్‌కు వచ్చి అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అమీర్ మాత్రం తాగుడుకు బానిస అయిపోయాడు. ఇలా మద్యం సేవిస్తూ ప్రతిరోజూ తన భార్యను కొడుతుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు అమీర్‌కు నచ్చజెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ క్రమంలోని మంగళవారం సాయంత్రం పూట మద్యం మత్తులో ఉన్న అమీర్ తన భార్య హజరత్‌పై దాడి చేశాడు. అర్ధరాత్రికి మళ్లీ కర్రతో దారుణంగా కొట్టాడు.

ఇవి కూడా చదవండి

అనంతరం ఆమె పడుకున్న చోటే చీరతో ఆమెను కట్టేసి ఏకంగా కరెంట్ షాక్ ఇచ్చారు. అయినా కూడా అతని కసి తీరలేదు. ఇక చివరికి ఉరివేసి హత్య చేశాడు. బుధవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను తీసుకుని అమీర్ అనుమానాస్పదంగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో గూడెం వాసులు అతడ్ని పట్టుకున్నారు. తమదైన శైలిలో అసలు ఏం జరిగింది అని అడడగా అసలు విషయం బయటకు వచ్చింది. తన భార్యను హత్య చేసినట్లు అమీర్ వాళ్లకు చెప్పాడు. దీంతో స్థానికులు అమీర్‍‌ను అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అమీర్‌ను అరెస్టు చేశారు. మృతురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక అమీర్ తన భార్యను ఇలా దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.