ఇంటర్ బుక్స్‌కి ఇక కొత్త కోడ్.. అదేంటంటే!

ఇంటర్ విద్యార్థులు చదువుకునే సబ్జెట్ బుక్స్‌‌లలో క్యూఆర్ కోడ్‌ని ముంద్రించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా దీనిపై ఇంటర్ బోర్డు అధికారులు, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), తెలుగు అకాడమీ..

ఇంటర్ బుక్స్‌కి ఇక కొత్త కోడ్.. అదేంటంటే!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 12:34 PM

ఇంటర్ విద్యార్థులు చదువుకునే సబ్జెట్ బుక్స్‌‌లలో క్యూఆర్ కోడ్‌ని ముంద్రించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా దీనిపై ఇంటర్ బోర్డు అధికారులు, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), తెలుగు అకాడమీ అధికారులతో చర్చించనున్నారు. ఈ క్యూఆర్ కోడ్ వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనాలు ఉంటాయని విద్యాశాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా క్యూఆర్ కోడ్ పుస్తకాలు 2021-2022 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. కాగా ఇప్పటికే ఎస్సీఈఆర్టీ 8, 9 తరగతుల ప్రధాన సబ్జెక్టుల పుస్తకాలను క్యూఆర్ కోడ్ విధానంలో ముద్రించినందున ఆ సంస్థలోని నిపుణుల సూచనలను ఇంటర్ బోర్డు తీసుకోనుంది.

ఈ క్యూఆర్‌ కోడ్‌తో ఉపయోగాలు:

– సబ్జెక్టుల్లో అవసరమైనచోట ఈ కోడ్‌ని ముద్రిస్తారు – స్టార్ట్ ఫోన్ సహాయంతో దాన్ని స్కాన్ చేస్తే మరింత సమాచారం, వీడియోలు, ఫొటోలు ఫోన్‌లోకి వస్తాయి – దీంతో విద్యార్థులు మరింత జ్ఞానాన్ని సంపాదించవచ్చు. పరీక్షల సమయంలో మరింత సహాయపడుతుంది – కొన్ని సందర్భాల్లో పాఠాలు మిస్ అయితే.. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తే అందుకు సంబంధించిన వీడియోలు వస్తాయి. – నేటి పోటీ ప్రపంచంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే కాకుండా ఆసక్తి ఉన్నవారు, తెలివైన విద్యార్థులు మరింత లోతుగా, వివరంగా తెలుసుకోవాలనుకునే ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

కాగా పాఠ్యాంశ పుస్తకాల్లో ఎంత సమాచారం ఉండాలో, క్యూఆర్‌ కోడ్‌లో ఎంత ఉండాలో ఆయా తరగతులను బట్టి నిపుణులు నిర్ణయిస్తారు.

Read More:

తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్‌.. ఇంట్లో ఇలా ఉండాలి..