కరోనా అలర్ట్: హైదరాబాద్‌లోని 159 ప్రాంతాల్లో కొత్త కంటైన్మెంట్ జోన్లు ఇవే..

తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజల మూమెంట్ పెరిగిందని..వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే కోవిడ్ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. దీంతో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

కరోనా అలర్ట్: హైదరాబాద్‌లోని 159 ప్రాంతాల్లో కొత్త కంటైన్మెంట్ జోన్లు ఇవే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 05, 2020 | 2:07 PM

తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజల మూమెంట్ పెరిగిందని..వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. 60 వేల మందికి కరోనా వచ్చినా వైద్యం అందించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. లక్షణాలు లేని కరోనా పేషెంట్లకు ఇంటిలోనే వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే కోవిడ్ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. దీంతో నగరంలో కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 3 నాటికి నగరంలో 159 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కాగా లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో.. కొత్త ప్రాంతాల్లోనూ కరోనా కేసులను గుర్తిస్తుండటంతో.. కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 3 నాటికి నగరంలో 159 ప్రాంతాల్లోని ఇళ్లను కంటైన్మెంట్లో ఉంచినట్లు వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో

జోన్ల వారిగా వివరాలు:

–  సికింద్రాబాద్ జోన్లో 33 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. సికింద్రాబాద్‌లో 6, ముషీరాబాద్‌లో ఏడు, అంబర్‌పేటలో 13 మల్కాజ్‌గిరిలో 7 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

– కూకట్‌పల్లి జోన్ పరిధి మూసాపేట డివిజన్‌లో 10 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

కుత్బుల్లాపూర్‌లో 7, మహేశ్వరం జోన్‌లోని జలపల్లి మున్సిపాలిటీలో 6, బడంగ్‌‌పేటలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

– ఎల్బీనగర్ జోన్‌లో మొత్తం 21 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇందులో ఉప్పల్ సర్కిల్‌లో 16, సరూర్‌నగర్‌లో 4, హయత్‌నగర్‌లో ఒకటి చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

-చార్మినార్ జోన్‌లో 28 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మలక్‌పేటలో 1, సంతోష్ నగర్‌లో 16, చాంద్రాయణ గుట్టలో 2, చార్మినార్‌లో 5, ఫలక్‌నుమాలో 4 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

-ఖైరతాబాద్ జోన్‌లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 35కి చేరింది. మెహదీపట్నంలో 5, కర్వాన్ అండ్ జియాగుడ డివిజన్లలో 17, ఖైరతాబాద్‌లో 5, జూబ్లీహిల్స్‌లో 8 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

-రాజేంద్ర నగర్‌ నగర్ జోన్‌లోని రాజేంద్రనగర్, మణికొండ ప్రాంతాల్లో ఏడు కంటైన్మెంట్ జోన్లు ఉండగా… శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ డివిజన్‌లో 4, శేరిలింగంపల్లిలో 5 చొప్పున మొత్తం 9 కంటైన్మెంట్ జోన్లున్నాయి.

అయితే, ఈ ప్రాంతాలు మొత్తం కంటైన్మెంట్‌లో లేవని.. వీటిలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇళ్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.