AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజీకొత్తూరులో మిడతల దండు..రైతుల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిడతల దండు ప్రత్యక్షమైంది. దీంతో జిల్లా వాసులు, రైతులు మిడతల భయంతో హడలెత్తిపోయారు. జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో..

బీజీకొత్తూరులో మిడతల దండు..రైతుల ఆందోళన
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 05, 2020 | 12:32 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిడతల దండు ప్రత్యక్షమైంది. దీంతో జిల్లా వాసులు, రైతులు మిడతల భయంతో హడలెత్తిపోయారు. జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో బుధవారం జిల్లేడు చెట్లపై మిడతలు కనిపించాయి. మిడతలు పెద్ద సంఖ్యలో జిల్లేడు చెట్లపై చేరి వాటి ఆకులు తిని చెట్లకు ఆకులు లేకుండా మోడుగా మార్చాయి. ఇటీవలి కాలంలో మిడతల వల్ల కలిగే నష్టాలపై అధికారులు అప్రమత్తం చేయడం, పక్క రాష్ట్రాల నుంచి ఏ క్షణంలోనైనా మిడతలు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్న తరుణంలోనే మిడతలు కనిపించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మిడతలు చెట్ల ఆకులు తిని మోడుగా మార్చడం గమనించిన వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. మండల వ్యవసాయ అధికారి డి.సాయిశంతన్‌కుమార్‌ బీజీకొత్తూరు గ్రామాన్ని సందర్శించి జిల్లేడు చెట్లపై ఉన్న మిడతలను పరిశీలించారు. ఈ మిడతలు పంటలు నాశనం చేసేవి కావని, జిల్లేడు చెట్ల మీద మాత్రమే పెరుగుతాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారి తెలిపారు. దీంతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us
ఈగ సినిమాలో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు..
ఈగ సినిమాలో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు..
పూజ చేస్తుండగా చిన్న ఏమరపాటు.. క్షణాల్లో నిండు ప్రాణం బలి!
పూజ చేస్తుండగా చిన్న ఏమరపాటు.. క్షణాల్లో నిండు ప్రాణం బలి!
వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర అంచనాలు
వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర అంచనాలు
మల్లె మొక్క పెరగడం లేదా..? ఇలా చేస్తే గుత్తులు గుత్తులు పూస్తాయ్
మల్లె మొక్క పెరగడం లేదా..? ఇలా చేస్తే గుత్తులు గుత్తులు పూస్తాయ్
హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి
హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి
ఈ కడియం ధరిస్తే ఈ రాశుల వారికి అదృష్టం జిడ్డులా పడుతుంది..
ఈ కడియం ధరిస్తే ఈ రాశుల వారికి అదృష్టం జిడ్డులా పడుతుంది..
ఏపీ వాసులకు సూపర్ గుడ్‌న్యూస్..రూ.9,889 కోట్లతో అభవృద్ది పనులు
ఏపీ వాసులకు సూపర్ గుడ్‌న్యూస్..రూ.9,889 కోట్లతో అభవృద్ది పనులు
కోహ్లీ 'లైక్' వివాదం.. షాకిచ్చిన జర్మన్ ఇన్ఫ్లుయెన్సర్..!
కోహ్లీ 'లైక్' వివాదం.. షాకిచ్చిన జర్మన్ ఇన్ఫ్లుయెన్సర్..!
NCHM JEE 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. డౌన్ లోడ్ లింక్
NCHM JEE 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. డౌన్ లోడ్ లింక్
ఈగల బెడదకు చెక్.. వాటిని తరిమికొట్టే 7 అదిరిపోయే చిట్కాలు..
ఈగల బెడదకు చెక్.. వాటిని తరిమికొట్టే 7 అదిరిపోయే చిట్కాలు..