Telangana: సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..

తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 9 వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేశారు. రూ.1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

Telangana: సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..
Pm Modi In Adilabad
Follow us

|

Updated on: Mar 05, 2024 | 11:46 AM

తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 9 వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేశారు. రూ.1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసర్చ్ సెంటర్‎ను ప్రారంభించారు. ఇక మెదక్ జిల్లాలో 399 కోట్లరూపాయలతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఘట్ కేసర్ – లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలును పచ్చజెండా ఊపి జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రజలకు నమస్కారం అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ జిల్లా కేంద్రంగా సివిల్ ఏవియేషన్ రీసర్చ్ సెంటర్‎ను ప్రారంభించామన్నారు. ఈ సంస్థ వల్ల తెలంగాణ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత్ కోసం ఆధునిక మౌలిక సౌకర్యాలు అత్యవసరమని మోదీ తెలిపారు. రాష్ట్రాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యం అని చెప్పారు. నిన్న ఆదిలాబాద్‎లో రూ.56వేల కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..