ప్రారంభోత్సవానికి ముందే కాళోజీ కళాక్షత్రాన్ని చుట్టుముట్టిన రాజకీయ వివాదాలు.. క్రెడిట్ ఎవరిది..?

ఓరుగల్లుకు ఐకాన్‌గా నిలిచిన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మద్య క్రెడిట్ ఫైట్‌కు దారి తీసింది. ఈ క్రెడిట్ ఫైట్‌లో ఆ అపురూప నిర్మాణం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ చారిత్రక నిర్మాణం క్రెడిట్ మాదంటే మాదే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.

ప్రారంభోత్సవానికి ముందే కాళోజీ కళాక్షత్రాన్ని చుట్టుముట్టిన రాజకీయ వివాదాలు.. క్రెడిట్ ఎవరిది..?
Kaloji Kalakshetram
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 10, 2024 | 4:24 PM

ఓరుగల్లుకు ఐకాన్‌గా నిలిచిన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మద్య క్రెడిట్ ఫైట్‌కు దారి తీసింది. ఈ క్రెడిట్ ఫైట్‌లో ఆ అపురూప నిర్మాణం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ చారిత్రక నిర్మాణం క్రెడిట్ మాదంటే మాదే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. అసలు కాలేజీ కళాక్షేత్రం గొప్పతనం ఎవరిది..? ఓరుగల్లు ప్రజలు ఏమంటున్నారు..?

అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలికను తెలిపిన గొప్ప కవి.. హక్కుల కోసం తన కలంతో గళమెత్తి నిగ్గదీసి కడిగేసిన ప్రజల మనిషి ప్రజాకవి కాలోజీ నారాయణరావు. పుట్టుక నీది – చావు నీది. బతకంతా సమాజానిది అని మనిషి జీవిత సత్యాన్ని తన కవితల ద్వారా వివరించిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి.

తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం తన కలంతో గళమెత్తి గర్జించిన కాళోజీ నారాయణరావు జ్ఞాపకార్థం హనుమకొండలో అపురూప నిర్మాణం రూపుదిద్దుకుంది. రవీంద్రభారతిని మరిపించేలా నిర్మాణమైన కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు ప్రజల చేత ప్రశంసలు అందుకుంటుంది. ఆ నిర్మాణం చూసి ఓరుగల్లు ప్రజలంతా వాహ్ అంటున్నారు. ఓరుగల్లు కు ఐకాన్ గా నిలిచిన ఈ భారీ నిర్మాణం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కాలోజీ కళాక్షేత్రం క్రెడిట్ మాదంటే మాది అంటూ ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

2014లో మేము శంకుస్థాపన చేశాం.. అనివార్య కారణాల వల్ల పూర్తి చేయలేకపోయాం. కానీ ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ వారి ఖాతాలో వేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తూ హడావుడి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్ ఆరోపించారు. కేవసం రంగులు మాత్రమే వారు వేశారని విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం విమర్శలపై తాజా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకుస్థాపన చేసే పదేళ్లు గడిచిన పూర్తి చేయని దద్దమ్మలు మీరు అని ఆరోపించారు. పదేళ్ల కాలంలో కేవలం రూ. 40 కోట్లు ఖర్చుపెట్టి స్కిల్టన్ లా వదిలేసిన కాళోజీ కళాక్షేత్రాన్ని వెంటపడి పూర్తి చేశానని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అదనంగా మరో రూ. 45 కోట్ల నిధులు తీసుకొచ్చి కేవలం 8 నెలల వ్యవధిలోనే కాళోజీ కళాక్షేత్రం పూర్తిచేసి ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నానని నాయిని అన్నారు.. వినయ్ భాస్కర్ రాజకీయ జీవితమంతా కబ్జాలు, కమిషన్లు తప్పా, ప్రజలకు ఏం చేశాడో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంతేకాదు అబద్ధాలు ఆడడంలో ఆయనను మించిన వారు లేరు. ఇదే కళాక్షేత్రంలో దాస్యంకు నట విరాట పరాటా గోకర్ణ అనే అవార్డు ఇవ్వాలని సీఎంకు సిఫారసు చేస్తానని ఎమ్మెల్యే నాయిని అన్నారు.

అయితే కాళోజీ కళాక్షేత్రం వివాదంపై ఓరుగల్లు ప్రజలు, ప్రజాప్రతినిధులు, మేధావులు విద్యావేత్తలు, కళాకారులు బిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2014 సెప్టెంబర్ 9వ తేదీన కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండలో కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి పునాది రాయి వేశారు. పదేళ్లు గడిచిన కాలేజీ కళాక్షేత్ర నిర్మాణాన్ని 50% శాతం కూడా పూర్తి చేయలేదు. అసంపూర్తిగా మిగిలిపోయిన కాళోజీ కళాక్షేత్రం అనేక విమర్శలు మూటకట్టుకుంది. నేతలపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీని తర్వాత మొదలుపెట్టిన అనేక నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయడం లేదనే విమర్శలు వెల్లు వెత్తాయి.

ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాలోజీ కళాక్షేత్రం వెంటపడి దానికి ఒక రూపం తీసుకొచ్చారని ఆయనను ఓరుగల్లు మేధావులు కళాకారులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..