AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి విచిత్రం రా స్వామీ..! ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు!

భూవివాదంలో తమ ప్రత్యర్థికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ సంఘటన నిదర్శనం అంటున్నారు కుటుంబసభ్యులు.

ఇదెక్కడి విచిత్రం రా స్వామీ..! ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు!
Police Case
P Shivteja
| Edited By: |

Updated on: Nov 19, 2024 | 4:57 PM

Share

ఓ ఎఫ్ఐఆర్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు.. ఏకంగా మరణించిన వ్యక్తిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకుని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బతికి ఉన్న వారిపై కేసు నమోదు చేయకుండా చనిపోయినవారి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన వింత సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగింది. ఓ భూ వివాదంలో మరణించిన వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు నర్సాపూర్ పోలీసులు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివారులోని లచ్చిరాం తండాలోని 200 సర్వే నంబర్‌లో కొన్ని సంవత్సరాలుగా భూమివాదం కొనసాగుతుంది. భూ వివాదంలో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నర్సాపూర్ పోలీసులు. కేసు నమోదైన వారిలో పాతులోత్ విఠల్ పెరు ఏ4 గా చేర్చారు. విఠల్ పేరు ఎఫ్ఐఆర్‌లో ఉండటం చూసి ఆయన కుటుంబీకులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. అందుకు కారణం విఠల్ ఏడు సంవత్సరాల క్రితమే చనిపోయాడు. పోలీసులు కనీసం విచారణ చేయకుండనే ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు పెట్టడం ఏంటని విఠల్ కుటుంబీకులు మండిపడుతున్నారు.

భూవివాదంలో తమ ప్రత్యర్థికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ సంఘటన నిదర్శనం అంటున్నారు కుటుంబసభ్యులు. మృతుడి ఫోటో, డెత్ సర్టిఫికేట్‌ను చూపిస్తూ తమను పోలీసులు భూవివాదంలో భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోయారు. కేసు పూర్తి దర్యాప్తు చేపట్టకుండానే ప్రత్యర్ధులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ లబోదిబోమంటున్నారు విఠల్ కుటుంబీకులు, లచ్చిరాం తండావాసులు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్