ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు..

 మీర్ చౌక్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. ఆపై పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి పిల్లడి నుంచి తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే బాలుడు పెద్ద ఎత్తున ఏడుస్తూ తన బండి కోసం పోలీసులను ప్రాదేయపడిన వీడియో వైరల్ గా మారింది.  ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ వాహనాలు నడిపేస్తున్నారు. ముఖ్యంగా కొందరు మైనర్లు అయితే అడ్డూఅదుపు లేకుండా బండి వెంటపెట్టుకుని రోడ్ల మీద వెళ్లిపోతున్నారు.

ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు..
Hyderabad
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Srikar T

Updated on: Jul 04, 2024 | 8:00 AM

మీర్ చౌక్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. ఆపై పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి పిల్లడి నుంచి తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే బాలుడు పెద్ద ఎత్తున ఏడుస్తూ తన బండి కోసం పోలీసులను ప్రాదేయపడిన వీడియో వైరల్ గా మారింది.  ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ వాహనాలు నడిపేస్తున్నారు. ముఖ్యంగా కొందరు మైనర్లు అయితే అడ్డూఅదుపు లేకుండా బండి వెంటపెట్టుకుని రోడ్ల మీద వెళ్లిపోతున్నారు. సరైన అవగాహన ఉండని చిన్న పిల్లలకి బండి ఇస్తే ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకుంటాయనేది ఇక్కడ అందరూ భయపడుతున్న విషయం. అందుకే హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో అడుగడుగునా పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

మైనర్లు వాహనం తోలితే చట్టపరమైన చర్యలతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్ష వేసే విధంగా చట్టాలు ఉన్నాయంటూ పదేపదే పోలీసులు హెచ్చరించినప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలలో చిన్నారులు వాహనాలు తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు. ఎన్ని సార్లు తీవ్రంగా హెచ్చరించినా ఇలాంటి చర్యలకు సరైన అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. తాజాగా మీర్ చౌక్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ట్రాఫిక్ పోలీస్ మహిళ అధికారి అనురాధ వాహన తనిఖీలు చేసే సమయంలో ఓ బుడ్డోడు అడ్డంగా దొరికిపోయాడు. ఆ బాలుడి దగ్గర నుంచి పూర్తి వివరాలు తీసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేసే పనిలో పడ్డారు సిబ్బంది. బాలుడిని హెచ్చరిస్తూ ఇంకోసారి ఇలా చేయకూడదని చెబుతున్న క్రమంలోనే ఆ పిల్లాడు తెగ భయపడిపోయాడు. ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేశాడు.

మరీ ముఖ్యంగా ఆ సమయంలో ఆ వాహనాన్ని పట్టుకొని ఆ బుడ్డోడు అత్యంత దారుణంగా ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాహనాన్ని హత్తుకుని ఏడుస్తున్న దృశ్యాలు చూస్తుంటే అక్కడ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి. కానీ మైనర్ బాలుడికి, కనీసం డ్రైవింగ్ పై అవగాహన లేని వారికి, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే కాళ్లు కూడా నేలకు అందని పిల్లలకు బండి చేతికి ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారు తల్లిదండ్రులు, వారి బంధువులు. దీనివల్ల మైనర్ బాలురకే కాకుండా పక్కనుంచి వెళ్తున్న వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే చివరికి పోలీసులు ఆ వాహనం సీజ్ చేసి ఆ బాలుడి తల్లిదండ్రులకి సమాచారం అందించారు. ఏది ఏమైనా మైనర్లు ఇలా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం కాగా, ప్రమాదాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏడిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. తప్పు చేసి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకునేకంటే ఎలాంటి వాహనాలు మైనర్లకు ఇవ్వకుండా నిశ్చింతగా ఉండటమే మంచిదని కొందరు సామాజిక వేత్తలు కూడా చెబుతున్నారు. అందుకే దీనిపై తల్లిదండ్రులే శ్రద్ధ వహించాలని, తమ పిల్లల పట్ల బాధ్యతగా నడుచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!