PM Modi: నేడు నిజామాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 8 వేల కోట్ల పనులకు శ్రీకారం..
Nizamabad, October 03: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. రూ. 8 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని బీదర్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు.

Nizamabad, October 03: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. రూ. 8 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని బీదర్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో గిరిరాజ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభల వేదికల వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3:40 గంటల వరకు ఓ సభా వేదిక పైనుంచి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలుంటాయి. అనంతరం 3:45కి సమీపంలోని బహిరంగ సభా వేదికపై నుంచి ప్రసంగిస్తారు. దీనికి ‘ఇందూరు జన గర్జన సభ’గా బీజేపీ నామకరణం చేసింది. సాయంత్రం 5 గంటలకు బీదర్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
రామగుండంలో ఎన్టీపీసీ రూ. 6,000 కోట్లతో చేపట్టిన పవర్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రూ. 1,200 కోట్లతో మనోహరాబాద్-సిద్దిపేట మధ్య నిర్మించిన 76 కి.మీ కొత్త రైలు మార్గాన్ని ప్రారంభిస్తారు. 305 కోట్లతో మన్మాడ్-ముద్కేడ్ – మహబూబ్‌నగర్ – డోన్ మధ్య చేపట్టిన రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును, సిద్దిపేట-సికింద్రాబాద్ మార్గంలో తొలి రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు. వీటితోపాటు సుమారు రూ. 1,360 కోట్లతో 496 బస్తీ దవాఖానాల ఏర్పాటు, ఆయుష్మాన్ భారత్ కింద పలు జిల్లా కేంద్రాల్లో 50 పడకలతో నిర్మించబోయే 20 క్రిటికల్ కేర్ విభాగాల పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.
పసుపు బోర్డు ఏర్పాటుపై మరోసారి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే పసుపు బోర్డు ప్రకటనపై నిజామాబాద్‌లో పాలాభిషేకాలు మొదలయ్యాయి. బోర్డు ఏర్పాటుకు నిర్ణయించినట్లు పాలమూరు సభలోనే ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మోదీ పాల్గొనే సభకు పెద్ద ఎత్తున పసుపు రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బోర్డు ఎక్కడ ఏర్పాటుచేయనున్నారు? దానికి ఎంతకాలం పడుతుంది? తదితర విషయాలపై ప్రధాని స్పష్టత ఇస్తారని రైతులు ఆశిస్తున్నారు.
తెలంగాణ బిజెపి నిర్వహిస్తున్న ఇందూరు జనగర్జన.
ముఖ్యఅతిథిగా రానున్న భారత ప్రధాని శ్రీ @narendramodi గారు. pic.twitter.com/NnDbmS2iYl
— BJP Telangana (@BJP4Telangana) October 2, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




