Mann Ki Baat: ఆయన జీవితం.. నేటి యువతకు ఆదర్శం.. మన్ కీ బాత్’లో కొమురం భీం త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తోన్న రేడియో కార్యక్రమం మన్ కీ బాత్. ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పీఎం మోడీ ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తూ వస్తోన్నారు. 2014 అక్టోబర్ 3వ తేదీన మొదటి మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈరోజు 127 ఎపిసోడ్ ప్రసారం అయింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోధుడు ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురంభీం త్యాగాలను కొనియాడారు పీఎం నరేంద్ర మోడీ.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం ‘మన్ కీ బాత్’, దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆలోచనాత్మక వేదికగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని నేరుగా దేశ ప్రజలతో మమేకమవుతూ.. దేశాభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సామాజిక విలువలు, జాతీయ చైతన్యం వంటి అంశాలపై తన ఆలోచనలు పంచుకుంటు వస్తున్నారు మోడీ.
ఈ ఆదివారం ప్రసారమైన 127వ ఎపిసోడ్లో భారత గిరిజన నాయకుల స్ఫూర్తిదాయక జీవితాలను స్మరించారు. ప్రముఖంగా తెలంగాణకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఆదివాసీల ఆరాద్య దైవం గోండు బెబ్బులి.. కొమరం భీమ్ గురించి ప్రస్తావించారు. ఆయన త్యాగం, ధైర్యం, నాయకత్వం నేటి తరానికి ఆదర్శం అంటూ కొనియాడారు. ప్రదాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. “కొమరం భీమ్ జయంతిని అక్టోబర్ 22న దేశవ్యాప్తంగా గౌరవప్రదంగా జరుపుకున్నాం. ఆయన కేవలం 40 ఏళ్లు మాత్రమే జీవించినప్పటికీ, ఆయన ప్రభావం అపారమైనది. గిరిజన సమాజంలో ఆయన ఒక స్ఫూర్తిదాయక దీప్తి,” అని కీర్తించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్ ధైర్యం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఒక కీలక అధ్యాయమని ప్రదాని మోదీ గుర్తు చేశారు.
నేటి తరం ఆయన త్యాగాలను మరువలూడదంటూ పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు సాధించిన విజయానికి ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు. భారతదేశం సాధించిన విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని నింపిందన్నారు. ఇదేవిధంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.