Telangana: తెలంగాణ సిగలో మరో మణిహారం.. సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని..

Telangana - PM Modi: తెలంగాణకే మణిహారంగా మారబోతున్న సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని మోదీ.

Telangana: తెలంగాణ సిగలో మరో మణిహారం.. సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని..
Pm Narendra Modi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 30, 2022 | 3:38 PM

Telangana – PM Modi: తెలంగాణకే మణిహారంగా మారబోతున్న సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని మోదీ. నీటిపై తేలియాడే ఈ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉజ్వల భారత్‌ – ఉజ్వల్‌ భవిష్యత్‌ పవర్‌ – 2047 సదస్సులో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం Ntpcలో నిర్మించిన నీటిపై తేలియాడే సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు ప్రారంభించారు. ఈ పవర్ ప్రాజెక్టుకు ఎన్నో విశిష్ఠతలు ఉన్నాయి. 100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన ధ్యేయంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 423 కోట్లు ఖర్చు చేశారు. కాగా, జులై 1 నుంచే ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు అధికారులు.

పూర్తి పర్యావరణహితంగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టులో అలలతో ప్లేట్లు దెబ్బతినకుండా అధునాతన బెలూన్‌ సిస్టమ్‌ టెక్నాలజీని వినియోగించారు. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లకు ప్రత్యామ్నాయంగా సోలార్‌, విండ్‌, హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల వైపు దృష్టిసారించిన అధికారులు ఆ దిశగా విజయం సాధించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..