Telangana: నిత్య పెళ్లి కొడుకుపై పీడీ యాక్ట్.. మహిళలను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని..
Nalgonda News: చీటింగ్, గంజాయి వంటి తీవ్రమైన నేరాలు చేస్తే పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగిస్తారు. ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకుంటే పిడి యాక్ట్ ను ప్రయోగిస్తారా..? ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. కానీ నల్లగొండలో అమాయక మహిళలను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని..
Nalgonda News: చీటింగ్, గంజాయి వంటి తీవ్రమైన నేరాలు చేస్తే పోలీసులు పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తారు. ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకుంటే పిడి యాక్ట్‌ను ప్రయోగిస్తారా..? ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. కానీ నల్లగొండలో అమాయక మహిళలను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని.. నలుగురిని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. నిత్య పెళ్లి కుమారుడిని పోలీసులు కటకటాల పాలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నల్గొండ పట్టణంలోని పాతబస్తీ లైన్‌వాడ ప్రాంతానికి చెందిన గారాల శివశంకర్ ఫ్లవర్ డెకరేటర్‌గా వ్యాపారం చేస్తున్నాడు. మొదటి భార్య చనిపోయాక మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇతడు పెట్టే బాధలు భరించలేక ఆమె దూరంగా ఉంటోంది. కొద్దిరోజుల తర్వాత నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత ఆమెకు తెలియకుండా నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన ప్రైవేటు టీచర్‌ను మభ్యపెట్టి… గతంలో జరిగిన రెండు వివాహాలను దాచి పెట్టి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులకే తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన టీచర్.. భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి అతడికి దూరంగా ఉంటున్నారు.
ఇదే క్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన మైనర్ బాలికపై కన్నేసిన శంకర్ ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. అంతకముందే తనకు జరిగిన పెళ్లిళ్ల గురించి దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఓ అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. వారం రోజులుగా బాలికను ఇంట్లో బంధించి లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు తన స్నేహితురాలి ద్వారా బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికను వివాహమాడి వేధిస్తున్నట్లు పోలీసులు శివశంకర్‌పై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి విచారించడంతో నిత్య పెళ్ళి కొడుకు వ్యవహారం వెలుగు చూసిందని పోలీసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. నిందితుడుపై పీడీ యాక్టు నమోదుకు ఆదేశించారని పోలీసులు చెబుతున్నారు. శంకర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సీఐ చెబుతున్నారు.
-ఎమ్. రేవన్ రెడ్డి, టీవీ9 రిపోర్టర్, నల్లగొండ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.