Telangana: జిల్లా ప్రభుత్వాస్పత్రిలో అమానుషం.. స్ట్రెచర్, వీల్‌చైర్ లేకపోవడంతో రోగి కాళ్లు పట్టుకుని..
రెండో అంతస్తులో వైద్యుడి దగ్గరకు వెళ్లాలని చీటీ ఇచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లాలంటే లిఫ్ట్ దాకా వెళ్లాలి. అక్కడికి వెళ్లాలంటే స్ట్రెచర్ కావాలి. కానీ ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ అందుబాటులో లేదు. కనీసం వీల్ చైర్ కూడా లేదు. దాని ఫలితం ఈ అమానుష దృశ్యం.

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. రోగి బంధువులే అతని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గత నెల 31న సాయంత్రం జబ్బు పడిన ఓ వ్యక్తిని అతని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాత… అతడితో వచ్చి న వారు ఓపీలో రిజిస్టర్ చేయించారు. రెండో అంతస్తులో వైద్యుడి దగ్గరకు వెళ్లాలని చీటీ ఇచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లాలంటే లిఫ్ట్ దాకా వెళ్లాలి. అక్కడికి వెళ్లాలంటే స్ట్రెచర్ కావాలి. కానీ ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ అందుబాటులో లేదు. కనీసం వీల్ చైర్ కూడా లేదు. దాని ఫలితం ఈ అమానుష దృశ్యం.
పట్టపగలు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్ నుంచి వార్డ్‌బాయ్ దాకా అంతా ఉంటారు. అందరూ చూస్తూ ఉండిపోయారే తప్ప.. ఎవరూ స్ట్రెచర్ తెచ్చి ఇచ్చింది లేదు. కనీసం ఏమైంది అని అడిగివాడే లేడు. వాస్తవానికి ఈ ఘటన మార్చి 31న జరిగినా బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు ఆస్పత్రి నిర్వాహకులు. కానీ ఇలాంటి విషయాలు ఆగుతాయా.. సోషల్ మీడియా ద్వారా బయటపడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారు ‘అసలేంటి ఈ దౌర్బాగ్యం’ అంటూ ఆస్పత్రి నిర్వహణా సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వీడియో..




స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్
కాగా దీనిపై నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. అసలు ఆ సంబంధిత రోగికి ఆస్పత్రితో సంబంధం లేదని పేర్కొంది. అతను ఓపీ కూడా తీసుకోలేదని తెలిపింది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆస్పత్రి పేరును బదనాం చేస్తున్నారని సూపరింటెండెంట్ తెలిపారు. సదరు రోగి తాగుబోతుని, మద్యానికి బానిసగా మారిన వ్యక్తిని తల్లిదండ్రులే లాక్కెళ్లారని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..