పాలమూరే పుట్టిల్లు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మత్స్య సంపదకు పుట్టినిల్లుగా మారబోతోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. అన్ని కుల వృత్తులకు పూర్వవైభవం..

పాలమూరే పుట్టిల్లు
Follow us

|

Updated on: Aug 29, 2020 | 9:10 PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మత్స్య సంపదకు పుట్టినిల్లుగా మారబోతోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. అన్ని కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. సహజసిద్ధమైన అందాలతో అలరారుతోన్న కోయల్ సాగర్ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. కోయిల్ సాగర్, కోయిలకొండ, మహబూబ్ నగర్ ను పర్యాటక సర్క్యూట్‌లా అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు మంత్రి, ఎమ్మెల్యేలు కోయిల్ సాగర్ వద్ద ప్రాంతాలను పరిశీలించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌న‌గ‌ర్ రూరల్ మండలం జమిస్తాపూర్ వరదరాజు చెరువు, దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డితో కలిసి మంత్రి శ‌నివారం చేప పిల్లలు వదిలారు.