సీపీ సజ్జనార్ మీటింగ్ లో శివారెడ్డి కామెడీ.!
పోలీస్ కానిస్టేబుల్స్ స్పోర్ట్స్ స్పీరిట్ తో పని చేయాలని సూచించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. పోలీస్ లు ఫిజికల్ ఫిట్ నెస్ పెంపొందించుకోవాలన్నారు. కారోనాను ఎదుక్కోవలంటే ఫిట్ గా ఉండాల్సిందేనని..

పోలీస్ కానిస్టేబుల్స్ స్పోర్ట్స్ స్పీరిట్ తో పని చేయాలని సూచించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. పోలీస్ లు ఫిజికల్ ఫిట్ నెస్ పెంపొందించుకోవాలన్నారు. కారోనాను ఎదుక్కోవలంటే ఫిట్ గా ఉండాల్సిందేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్యూటీతో పాటు ఏదో ఒక్కటి స్పోర్ట్ పై దృష్టి పెట్టాలని సూచించారు. ఫిజికల్ ఫిట్ నెస్ ఉంటే మెంటల్ గా ఫిట్ గా ఉంటారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి స్పోర్ట్ మాన్ స్పీరిట్ ఉండాలని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన నేషనల్ స్పోర్ట్స్ డే మీట్ లో పాల్గొన్న సీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు ను మనం నేషనల్ స్పోర్ట్స్ డే గా జరుపుకుంటామని చెప్పిన సీపీ.. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్స్ కు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2020 ముగింపు కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న , సినీ మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి సందడి చేశారు.



