AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadradri Talambralu: లక్ష దాటిన రాములోరి తలంబ్రాల బుకింగ్‌లు.. ఏప్రిల్‌ 10 వరకు బుకింగ్‌ సదుపాయం

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్‌ వస్తోంది. ఇప్పటివరకు ఒక లక్షకి పైగా మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) తలంబ్రాలను హోండెలివరీ..

Bhadradri Talambralu: లక్ష దాటిన రాములోరి తలంబ్రాల బుకింగ్‌లు.. ఏప్రిల్‌ 10 వరకు బుకింగ్‌ సదుపాయం
Bhadradri Talambralu
Srilakshmi C
|

Updated on: Apr 03, 2023 | 1:05 PM

Share

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్‌ వస్తోంది. ఇప్పటివరకు ఒక లక్షకి పైగా మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఆదివారం నుంచే ఈ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. భక్తుల డిమాండ్‌ దృష్ట్యా తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు సంస్థ పొడిగించింది. బుక్‌ చేసుకున్న భక్తులకు రెండు మూడు రోజుల్లోనే తలంబ్రాలను అందజేయనుంది. భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాల తొలి బుకింగ్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ బుక్‌ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం సజ్జనర్‌కు టీఎస్‌ఆర్టీసీ బిజినెస్‌ హెడ్‌(లాజిస్టిక్స్‌) పి సంతోష్‌ కుమార్‌ ముత్యాల తలంబ్రాలను అందజేశారు.

‘భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోంది. ఎంతో విశిష్టమైన ఆ తలంబ్రాలను పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది 88 వేల మంది బుక్‌ చేసుకుంటే.. ఈసారి సోమవారం నాటికి రికార్డు స్థాయిలో ఒక లక్షమందికిపైగా భక్తులు తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. మొదటగా 50 వేల మందికి తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం హోండెలివరీ చేస్తోంది. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నాం. భక్తుల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంలో తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు పొడిగించాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని’ టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ