- Telugu News Photo Gallery Cinema photos Music Director Chakri Brother Mahith Narayan emotional interview
‘అన్నయ్య చనిపోయాక.. ఆయన భార్య ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోయింది’.. చక్రీ సోదరుడు
టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులే. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు సహా ఎన్నో సినిమాలకు సుస్వర బాణీలు అందించి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు..
Updated on: Apr 03, 2023 | 10:01 AM

టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులే. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు సహా ఎన్నో సినిమాలకు సుస్వర బాణీలు అందించి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

2014లో చక్రీ గుండెపోటుతో కన్నుమూశారు. ఇక చక్రి మరణించిన తర్వాత కుటుంబంలో ఆస్తి తగాదాలు చెలరేగా రచ్చకెక్కింది. అప్పట్లో అన్ని వార్తాసంస్థల్లో ఈ విషయం తీవ్ర దుమారం లేపింది.

చక్రి సోదరుడు మహిత్ నారాయణ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'చక్రి అన్నయ్య చనిపోయాక ఆస్తి గొడవలు తలెత్తాయి. అన్నయ్య లేడనే బాధకి తోడు ఈ గొడవలతో ప్రతిరోజు నరకం అనుభవించాం'

'అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆయన భార్య అమ్మేసుకొని అమెరికా వెళ్లిపోయి.. అక్కడ ఇంకో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమెతో మాకెలాంటి సంబంధాలు లేవు. మరికొన్ని ఆస్తులు కోర్టు కేసులో పెండెంగ్‌లో ఉన్నాయంటూ' మహిత్ నారాయణ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.




