Jangaon Lathi Charge: వివాదస్పదమైన జనగామ లాఠీచార్జ్.. వెస్ట్‌జోన్ డీసీపీతో విచారణకు ఆదేశించిన సీపీ
Jangaon Lathi Charge: జనగామ లాఠీచార్జ్ ఘటనపై వెస్ట్‌జోన్ డీసీపీతో విచారణకు ఆదేశించారు సీపీ ప్రమోద్‌కుమార్. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం శాఖపరమైన చర్యలు ...

Jangaon Lathi Charge: జనగామ లాఠీచార్జ్ ఘటనపై వెస్ట్‌జోన్ డీసీపీతో విచారణకు ఆదేశించారు సీపీ ప్రమోద్‌కుమార్. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకోనున్నారు. జనగామ బీజేపీ ఇన్‌చార్జి పవన్ శర్మపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లాఠీచార్జ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంగళవారం జనగామ చౌరస్తా నుంచి నెహ్రూ పార్కు వరకు బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో తీవ్ర వివాదస్పదమైంది. దీంతో మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
విషయం తెలుసుకున్న సీఐ మల్లేష్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని వారిని అడ్డుకుని లాఠీచార్జ్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లాఠీచార్జ్ అనంతరం ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీతో సీపీ విచారణకు ఆదేశించారు.