Online Loan Apps: ఆన్‌లైన్‌ యాప్‌ దారుణాలను నివారించేందుకు రంగంలోకి దిగిన ఆర్బీఐ.. వర్కింగ్‌ గ్రూప్‌ల ఏర్పాటు

Online Loan Apps: ఇటీవల కాలంలో డిజిటల్‌ రుణాలను ఇచ్చే యాప్స్‌ వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో డిజిటల్‌ రుణాల దారుణాలను నివారించేందుకు రిజర్వ్‌ ...

Online Loan Apps: ఆన్‌లైన్‌ యాప్‌ దారుణాలను నివారించేందుకు రంగంలోకి దిగిన ఆర్బీఐ.. వర్కింగ్‌ గ్రూప్‌ల ఏర్పాటు
Follow us

|

Updated on: Jan 13, 2021 | 7:56 PM

Online Loan Apps: ఇటీవల కాలంలో డిజిటల్‌ రుణాలను ఇచ్చే యాప్స్‌ వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో డిజిటల్‌ రుణాల దారుణాలను నివారించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. దీనిపై మరింత అధ్యయనం చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. రుణ యాప్‌లు, ఇతర డిజిటల్‌ రుణాలను ఈ గ్రూప్‌ పరిశీలించనుంది. ఆర్థిక రంగంలో వివిధ డిజిటల్‌ పద్దతుల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడమనేది స్వాగతించదగిన విషయం. దీని ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు కూడా అంతే పొంచివున్నాయని ఆర్బీఐ తెలిపింది. ఈ విషయంలో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని, డేటా భద్రత, ప్రైవసీ, నమ్మకం, వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు తగిన విధంగా నియమ నిబంధనలు తయారు చేయాలని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా రుణాలు ఇస్తూ బాధితులను బేధింపులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. ఇలా డిజిటల్‌ యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తూ కోట్లాదిగా సంపాదిస్తున్నారు. దీనిపై పోలీసులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నిబంధనలను ఉల్లంఘించి ఎన్నో డిజిటల్‌ యాప్‌లు రుణాలను మంజూరు చేస్తున్నాయి. వీటి ద్వారా రుణాలు పొంది వడ్డీలు కట్టలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది.

Also Read: రాచకొండ పోలీసుల అదుపులో లోన్ యాప్ కేటుగాళ్లు.. పట్టుబడినవారిలో ఓ చైనా జాతీయుడు