Video: కన్నవారిని ఎదిరించి.. పారిపోయి పెళ్లి చేసుకుంది! కానీ, అంతలోనే..
శివ్‌పురిలోని 20 ఏళ్ల నైనా, చంద్రశేఖర్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకుని ఇంటినుండి పారిపోయారు. ఆరు సంవత్సరాల ప్రేమాయణం తరువాత కుటుంబం వ్యతిరేకించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. పారిపోయిన తరువాత, నైనా తన కుటుంబానికి ఒక వైరల్ వీడియో ద్వారా తమ నిర్ణయం గురించి తెలియజేసింది.
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో గల ఖనియాధానా నివాసి బల్లు సాహు కుమార్తె 20 ఏళ్ల నైనా, అదే ప్రాంతానికి చెందిన బద్రీ ప్రసాద్ సేన్ కుమారుడు చంద్రశేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. నైనా, చంద్రశేఖర్ ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ నైనా కుటుంబం ఈ వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో నైనా, చంద్రశేఖర్ శుక్రవారం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయారు. తమ కూతురు కనిపించడం లేదంటూ నైనా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటర్నెట్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అయింది.
అది చూసి.. నైనా తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. ఆ వీడియోను నైనా విడుదల చేసింది. చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత.. తాను ఎందుకు ఇలా చేశానో వివరిస్తూ.. తన దృష్టిలో కుటుంబ సభ్యులు అందరూ చనిపోయినట్లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను. నా దృష్టిలో కుటుంబ సభ్యులు చనిపోయారు. వారి దృష్టిలో నేను చనిపోయాను అంతే. ఇక నా కోసం వెతకొద్దు. నేను ఇతనితో కలిసి బతకాలని అనుకుంటున్నాను. మమ్మల్ని వదిలేయండి.. మా బతుకు మేం బతుకుతాం.” అని పేర్కొంది. ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

