AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం.. అప్పటి నుంచే అర్జీల స్వీకరణ..

ఎన్నికల కోడ్‎తో తాత్కాలికంగా వాయిదా పడ్డ ప్రజావాణి పునఃప్రారంభం కానుంది. నేటి నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో అర్జీలు స్వీకరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 7 శుక్రవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఈ కార్యక్రమం తాత్కాలిక వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి ప్రారంభించనున్నారు అధికారులు. ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడించారు.

Telangana: ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం.. అప్పటి నుంచే అర్జీల స్వీకరణ..
Praja Bhavan
Srikar T
|

Updated on: Jun 07, 2024 | 6:24 AM

Share

ఎన్నికల కోడ్‎తో తాత్కాలికంగా వాయిదా పడ్డ ప్రజావాణి పునఃప్రారంభం కానుంది. నేటి నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో అర్జీలు స్వీకరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 7 శుక్రవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఈ కార్యక్రమం తాత్కాలిక వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి ప్రారంభించనున్నారు అధికారులు. ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల కోడ్ వల్ల మార్చి 16 నుంచి ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఈకార్యక్రమానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు చేపట్టారు అధికారులు. పలు శాఖల్లో దాడుల చేశారు. ఇవాళ జరిగే ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులు తెలిపారు. ఇక ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్‌ల మరమ్మతుల నివేదికలు తదితర వివరాలపై వెంటనే నివేదిక సమర్పించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..