AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Statue: హైకోర్టు ఉత్తర్వులపై స్పందించిన ఎన్నారైలు.. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనపై కీలక నిర్ణయం

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28 న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తానా సభ్యులు, కొందరు ఎన్నారై లు, పారిశ్రామిక వేత్తలు కలిసి సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

NTR Statue: హైకోర్టు ఉత్తర్వులపై స్పందించిన ఎన్నారైలు.. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనపై కీలక నిర్ణయం
Ntr Statue
Basha Shek
|

Updated on: May 19, 2023 | 6:46 AM

Share

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28 న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తానా సభ్యులు, కొందరు ఎన్నారై లు, పారిశ్రామిక వేత్తలు కలిసి సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. 54 అడుగుల ఎత్తైనా భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహంపై యాదవ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ఆందోళనలు చేయడంతో పాటు.. పలు హిందూ సంఘాలు, యాదవ సంఘాలు కోర్టు మెట్లు ఎక్కాయి. విచారించిన కోర్టు.. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విగ్రహ ఏర్పాటు నిలిచింది. మరోవైపు కోర్టు స్టే పై హర్షం వ్యక్తం చేశారు కరాటే కల్యాణి.

ఇక్కడ అభ్యంతరమెందుకు?

మరోవైపు కోర్టు ఉత్తర్వులు రావడంతో వెంటనే ఎన్నారైలు స్పందించారు. కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలపై దృష్టి పెడతామంటున్నారు. మార్పులు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు ఎన్నారై జై తాళ్లూరి. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఎన్నోచోట్ల పెట్టారని, ఎక్కడాలేని అభ్యంతరం ఖమ్మంలోనే ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అయితే.. ఎన్నారైలు అన్నట్టుగా మొత్తం విగ్రహాన్నే మార్చుతారా? ఎలాంటి మార్పులు చేస్తారు? మరో విగ్రహం తీసుకొస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లేక కోర్టు ఫైనల్‌ తీర్పు వరకు వేచి చూస్తారా? అన్నది కూడా తెలియడం లేదు. మొత్తానికైతే ఈ నెల 28న జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతుల మీదుగా జరగాల్సిన విగ్రహావిష్కరణ మాత్రం వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు