BRS: వారికోసం కేసీఆర్ ఎదురుచూపులు.. నియోజకవర్గ ఇంచార్జ్‌లపై ఇంకా రాని స్పష్టత
ఏ పార్టీలో నుంచైనా ఒక నాయకుడు బయటకు వెళితే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఛాలెంజ్‌గా తీసుకొని ఆ నియోజకవర్గంలో మరింత బలపడేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎందుకో ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితిలో సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది..

ఏ పార్టీలో నుంచైనా ఒక నాయకుడు బయటకు వెళితే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఛాలెంజ్‌గా తీసుకొని ఆ నియోజకవర్గంలో మరింత బలపడేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎందుకో ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితిలో సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు. వారిని డిస్ క్వాలిఫై చేయాలని సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతోంది బీఆర్ఎస్. కానీ ఆ నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మాత్రం ఇప్పటివరకు నియమించలేదు. పార్టీ మారని ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో చాలామంది అడుగుతున్నా అధినేత నుంచి ఆన్సర్ లేదు. కొంతమంది పార్టీ కోసం ఆ నియోజకవర్గాల్లో దూకుడుగా పనిచేస్తున్నా.. మళ్లీ అదే ఎమ్మెల్యే తిరిగి పార్టీలకు వస్తే మా పరిస్థితి ఏంటి అని దిగులుతో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లా వెంకటరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ.
అయితే ఈ నియోజకవర్గాల్లో స్టేషన్ ఘనపురంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య చాలా చురుగ్గా పని చేస్తున్నారు. స్టేషన్ ఘనపురంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని రాజయ్య గెలుస్తారని కేసీఆర్ సమావేశంలో కూడా చెప్పారు. కానీ నియోజకవర్గంలో అధికారికంగా ప్రకటించలేదు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి నియోజకవర్గం మొత్తం గ్రిప్‌లోకి తీసుకున్నాడు. దూకుడుగా పార్టీని ముందుకు తీసుకెళుతున్న ఆయనే ఇన్చార్జ్ అని ప్రకటన మాత్రం లేదు. జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత తరచుగా పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మారినా పార్టీ డ్యామేజ్ కాకుండా చూసుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి అక్కడ ఇన్చార్జ్ లేరు.
నగరంలో ఉన్న పటాన్‌చేరు, శేర్‌లింగంపల్లి నియోజకవర్గాల్లో ఇన్చార్జ్‌గా బాధ్యతలు ఇవ్వండని కార్పొరేటర్లు, ఇంకొంతమంది నేతలు అడుగుతున్నా పార్టీ అధినేత మాత్రం స్పందించడం లేదు. ఇక మిగతా నియోజకవర్గాల్లోనూ కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇందుకు కారణం పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని పార్టీ పెద్దలు భావిస్తున్నారా? అందుకోసమే పదే పదే కాంగ్రెస్‌కు వెళ్లిన తమ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. బీఆర్ఎస్ డోర్లు ఓపెన్ చేస్తే అందరూ మళ్లీ పార్టీలో చేరతారంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అక్కడక్కడ పార్టీ నేతలు స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇన్చార్జ్‌లను నియమిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి ఇబ్బందిగా మారుతుందని, పార్టీలోనే ఇంటర్నల్ ఫైట్ మొదలై అసలుకే మోసం వస్తుందని అందుకోసమే ఇన్చార్జ్‌లను నియమించడం లేదని పార్టీలో చర్చ జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
