Nizamabad Urban Election Result 2023: నిజామాబాద్‌లో కమల వికాసం.. సూర్యనారాయణ ఘన విజయం..
Nizamabad Urban Assembly Election Result 2023 Live Counting Updates: ఒకప్పుడు డీఎస్ అడ్డా నిజామాబాద్ గడ్డ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బండిని రెండు సార్లు సక్సెస్‌ఫుల్ గా నడిపించిన డీఎస్ కి ఎమ్మెల్యేగా పట్టం కట్టి అసెంబ్లీకి పంపిన చరిత్ర ఇందూరు ఓటర్‌ది. ఇప్పుడు మరో సామాజిక వర్గానికి చెందిన నేతను రెండు సార్లు ఘన విజయాలతో సత్కరించారు. మరి ఓటర్లు మూడో ఛాన్స్ కూడా ఇస్తారా?

Nizamabad Urban Assembly Election Result 2023 Live Counting Updates: ఒకప్పుడు డీఎస్ అడ్డా నిజామాబాద్ గడ్డ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బండిని రెండు సార్లు సక్సెస్‌ఫుల్ గా నడిపించిన డీఎస్ కి ఎమ్మెల్యేగా పట్టం కట్టి అసెంబ్లీకి పంపిన చరిత్ర ఇందూరు ఓటర్‌ది. ఇప్పుడు మరో సామాజిక వర్గానికి చెందిన నేతను రెండు సార్లు ఘన విజయాలతో సత్కరించారు. 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గెలుపొందారు. నిజామాబాద్ అర్బన్ స్థానానికి జరిగిన హోరాహోరి పోరులో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బిర్ అలీ, బీఆర్ఎస్ అభ్యర్థి బిగల గణేష్ గుప్తాపై సూర్యనారాయణ ఘన విజయం సాధించారు.
2009లో ఏర్పడిన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,94,832. మొన్నటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 61.66 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ నియోజకవర్గంలో బీసీ, మైనారిటీ ఓటర్లే ఎక్కువ. కానీ.. ఇక్కడ గెలుపు ఓటములపై ప్రభావం చూపేది మాత్రం మున్నురు కాపు, పద్మశాలి, మైనారిటీలే. రాష్ట్రంలో ఎక్కడా లేనంత మంది మైనారిటీ ఓటర్లు నిజామాబాద్ అర్బన్‌లోనే ఉండటంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దాదాపు లక్ష 10 వేల మైనారిటి ఓట్లు, 40 వేల పద్మశాలీలు, 40 వేల మున్నూరు కాపులు ఇక్కడి నేతల భవిష్యత్తుల్ని నిర్దేశించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
నిజామాబాద్ అర్బన్.. 2014 వరకు ఇక్కడ రాజకీయం తెగరంజుగా ఉండేది. రెండు సార్లు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చక్రం తిప్పిన డీ.శ్రీనివాస్ అడ్డా ఇది. తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పవర్ సెంటర్లు తయారవ్వడంతో ట్రయాంగిల్ ఫైట్ కామనైపోయింది. డీఎస్ నిజామాబాద్ రూరల్‌కి వెళ్లిపోయారు. యెండల లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీచేశారు. ఇలా ఇద్దరు సీనియర్లు ఈ సెగ్మెంట్‌ని వదిలెయ్యడంతో 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు సునాయాసమైంది. బిగాల గణేష్ గుప్తాకు కనీసం పోటీ ఇవ్వలేక మూడు నాలుగు స్థానాలకు పరిమతమయ్యాయి అపోజిషన్ పార్టీలు. సెకండ్ ప్లేస్‌లో నిలిచి సర్‌ప్రైజ్ ఇచ్చింది ఎమ్‌ఐఎమ్ పార్టీ.
2009 ఎన్నికల్లోను, ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లోనూ బీజేపీ నుంచి యెండల లక్ష్మినారాయణే గెలుపొందారు. రెండు సార్లూ కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్‌నే యెండల ఓడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో చతుర్ముఖ పోటీలో ఎంఐఏం అభ్యర్థి మీర్ మాజాజ్ పై బీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాహేర్ బిన్ హుందాన్ పై 25 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు గణేష్ గుప్తా.
ఈసారి ఎలక్షన్స్‌లో బీజేపీ బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ తరుఫున ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ అర్బన్ స్థానంలో నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్