Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డ్రైవర్ కావాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ!

భారీ వాహనాలపై హెవీ వెహికల్​‌పై ఆర్టీసీ సంస్థ నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు ప్రత్యక్ష బోధన ఉంటుంది. ట్రైనింగ్‌లో భాగంగా ట్రాఫిక్‌ నిబంధనలు, బస్సును ఎలా ఆపరేట్ చేయాలి.. యూటర్న్, ఇతర వాహనాలకు ఓవర్ టేక్ చేయడం ఇతరత్రా మెలకువలు నేర్పుతారు.

Telangana: డ్రైవర్ కావాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ!
Rtc Driving Training
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Balaraju Goud

Updated on: Feb 14, 2025 | 4:44 PM

డ్రైవింగ్ నేర్చుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. అయితే టూ వీలర్స్, 4 వీలర్స్ శిక్షణ ఇచ్చేందుకు కుప్పలు తెప్పలుగా డ్రైవింగ్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే భారీ వాహనాలు నేర్చుకోవాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. ఎందుకంటే ఈ ట్రైనింగ్ సెంటర్స్ చాలా తక్కువ. అంతేకాదు.. కాస్త పైకం కూడా ఎక్కువే అవుతుంది. దీంతో భారీ వాహనాలు డ్రైవ్ చేయాలనే ఆసక్తికి ఉన్నప్పటికీ.. అటు వైపు చాలామంది మొగ్గు చూపరు. మరికొందరు ఆ వాహనాల్లో పనికి కుదిరి.. కొంతకాలానికి నొచ్చుకుంటున్నారు. అయితే ఆర్టీసీ ఈ సర్వీసు అందించేందకు ముందుకొచ్చింది. నిర్మల్ RTC డిపో ఆధ్వర్యంలో భారీ వాహనాల డ్రైవింగ్‌ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

భారీ వాహనాలపై హెవీ వెహికల్​‌పై ఆర్టీసీ సంస్థ నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు ప్రత్యక్ష బోధన ఉంటుంది. ట్రైనింగ్‌లో భాగంగా ట్రాఫిక్‌ నిబంధనలు, బస్సును ఎలా ఆపరేట్ చేయాలి.. యూటర్న్, ఇతర వాహనాలకు ఓవర్ టేక్ చేయడం ఇతరత్రా మెలకువలు నేర్పుతారు. డ్రైవింగ్‌లో పట్టు సాధించేందుకు అన్ని సూచనలు, సలహాలను ఇస్తారు. ఈ శిక్షణ కోసం బస్‌ డిపో ఆవరణలోని భవనంలో ఓ గదిలో ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేశారు. రూల్స్ గురించి తెలిపే బొమ్మల చార్టు రెడీ చేశారు.

మిగతా 20 రోజుల్లో.. ప్రతి రోజూ 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్‌ చేయిస్తారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 2 స్టీరింగులు ఉన్నటువంటి బస్సును ఉపయోగిస్తారు. ఏకాగ్రత, ఫిట్‌నెస్‌ కోసం చిన్న చిన్న వర్కువుట్స్, యోగా వంటివి చేయిస్తారు. ట్రైనింగ్‌లో భాగంగా యాంటీ బ్రేక్‌ సిస్టం, ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ సిస్టం, చిన్న చిన్న రిపేర్స్‌పై కూడా అవగాహన కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒక్కో టీమ్‌లో 15 మందికి ట్రైనింగ్​ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ కోసం రుసుముగా రూ.15,600 పే చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలైతే రూ.10 వేలు కడితే సరిపోతుంది. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. లైట్‌ మోటారు వెహికిల్‌, ట్రాన్స్‌పోర్టు లైసెన్స్‌ ఉంటేనే ట్రైనింగ్‌కు అర్హులు. ఏమైనా సందేహాలుంటే.. సెల్​ఫోన్​ నెంబర్ 73828 42443కు కాల్ చేయాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..