AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కలకలం.. వైఎస్ఆర్ కేంద్రంగా నేతల మధ్య పరోక్ష యుద్ధం..

పార్టీ నేతలకు అవగాహన సదస్సు నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. ఈ సమావేశానికి కొందరు వచ్చారు.. ఇంకొందరు రాలేదు...

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కలకలం.. వైఎస్ఆర్ కేంద్రంగా నేతల మధ్య పరోక్ష యుద్ధం..
Revanth Reddy
Shiva Prajapati
|

Updated on: Jan 04, 2023 | 4:26 PM

Share

పార్టీ నేతలకు అవగాహన సదస్సు నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. ఈ సమావేశానికి కొందరు వచ్చారు.. ఇంకొందరు రాలేదు. అదో సపరేట్‌ ఇష్యూ. అయితే వచ్చిన నేతల్లోనూ కొందరు ప్రస్తావించిన అంశాలు.. పరోక్షంగా తెరపైకి తెచ్చిన ఇష్యూస్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. వీళ్లు ఇక మారరు అనేలా నేతల కామెంట్స్ ఉన్నాయి. మొదట టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఏం అన్నారో తెలుసుకుందాం..

తొలు ప్రసంగించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వైఎస్ఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. 2003లో చేసిన పాదయాత్రను ప్రస్తావించారు. మళ్లీ ఆ తరహాలో పోరాటం చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అని ఆయన చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పెద్దలంతా ప్రతీన బూనాలని పిలుపునిచ్చారు రేవంత్. అయితే, ఇందులో వేరే ఉద్దేశం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అంటే ఇప్పుడు సీనియర్లను తనకు సహకరించడం లేదని రేవంత్ పరోక్షంగా చెప్పినట్లేనని అంటున్నారు.

ఇక రేవంత్‌ కామెంట్స్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. ఆ రోజుల్లో వైఎస్ఆఱ్ పాదయాత్ర ఓ సంచలనం అంటూనే.. అప్పుడు ఆయన వెంట తామంతా కలిసి నడిచామన్నారు. ఆ రోజు వైఎస్ తో కలిసిన నడిచిన సీనియర్ల పేర్లను ఒక్కొక్కటిగా చదివి వినిపించారు. అంటే ఇక్కడ రెండు అంశాలు చెప్పకనే చెప్పారు భట్టి విక్రమార్క. ఒకటి.. తామంతా అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని స్పష్టం చేయడం ఆయన మొదటి ఉద్దేశం. అంటే రేవంత్‌ రెడ్డి మధ్యలో పార్టీలోకి వచ్చారని పరోక్షంగా చెప్పేశారు. ఇక భట్టి ఇండైరెక్ట్‌గా చెప్పిన మరో అంశం.. అప్పట్లో వైఎస్ అందరినీ కలుపుకొని పోయేవారని, అందుకే తామంతా ఆయన వెంట నడిచామన్నారు. కానీ ఇప్పుడు పార్టీలో ఆ పరిస్థితి లేదన్నదే ఆయన ఉద్దేశం అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే పలువురు సీనియర్లు మీటింగ్‌కు రాకపోవడం ఓ రచ్చగా మారింది. ఇప్పుడు వైఎస్ఆర్ కేంద్రంగా రేవంత్, భట్టి విక్రమార్క మధ్య పరోక్షంగా నడిచిన ఈ డైలాగ్‌ వార్‌ కూడా పార్టీ శ్రేణుల్లో ఓ డిబేటబుల్ ఇష్యూగా మారిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!