Vande Bharat Express: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో వందే భారత్ రైలు. పూర్తి వివరాలు..
భారతీయ రైల్వే రూపురేఖల్ని మార్చేస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే ప్రారంభమైన అన్ని సర్వీసులకు ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు. దీంతో వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో వందే భారత్ సేవలను ప్రారంభిస్తోంది ఇండియన్ రైల్వే...

భారతీయ రైల్వే రూపురేఖల్ని మార్చేస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే ప్రారంభమైన అన్ని సర్వీసులకు ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు. దీంతో వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో వందే భారత్ సేవలను ప్రారంభిస్తోంది ఇండియన్ రైల్వే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడేలా.. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖల మధ్య రెండు సర్వీసులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం మరో మార్గంలోనూ వందే భారత్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
తర్వలోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వందే భారత్ నడపాలని రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. రెండు ఐటీ నగరాలను కలుపుతూ వచ్చే ఈ సర్వీసుకు భారీ డిమాండ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కొత్త వందే భారత్ రైలు నడిపే అంశాన్ని బీజేపీ నేతలతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ రైలుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదలా ఉంటే ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరుకు 570 కి.మీల దూరాన్ని చేరుకోవడానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే సుమారు నాలుగు గంటల సమయం తగ్గనుంది. దీంతో ఇకపై బెంగళూరుకు 8 గంటల్లో చేరుకోవచ్చు. దీంతో పాటు సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు సైతం మరో వందే భారత్ రైలును కూడా నడిపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 13వందే భారత్‌రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
