Bandi Sanjay: ఆయనను వదలిపెట్టం.. విజయవాడ, నల్గొండ జిల్లాల్లో ఏం చేశావో అన్ని బయటపెడతాం
కరీంనగర్ నుంచి సిద్దిపేట వచ్చే వరకు ఫోన్ తన వద్దే ఉందన్నారు. సిద్దిపేటలో తన ఫోన్ మిస్ అయ్యిందంటున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యహారంను బీజేపీ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సెల్‌ఫోన్ మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతోంది. తన ఫోన్ సీఎం కేసీఆర్ దగ్గరే ఉందని ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్. కరీంనగర్ నుంచి సిద్దిపేట వచ్చే వరకు ఫోన్ తన వద్దే ఉందన్నారు. సిద్దిపేటలో తన ఫోన్ మిస్ అయ్యిందంటున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యహారంను బీజేపీ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, విజయవాడ సత్యం బాబు కేసు కూడా తానకు తెలుసన్నారు. రంగ నాథ్ ఆస్తిపాస్తులు, ఆయన చేసే దందాలు కూడా తనకు తెలుసన్నారు. సీపీ రంగనాథ్ పలు ప్రశ్నలు సంధించారు బండి సంజయ్. విజయవాడ, నల్గొండ జిల్లాల్లో సీపీ ఏం చేశాడో అన్ని బయటపెడతానని అన్నారు.” నీవు పెట్టుకున్న పోలీస్ టోపీ మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలన్నారు.”
సీపీ రంగనాథ్‌నీ వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. అన్ని విషయాలు బయటికి తెస్తామన్నారు. సీపీ ఫోన్ లిస్ట్ బయట పెట్టాలన్నారు. ఆయనతో ఎవరు మాట్లాడారనే విషయం తెలిస్తే అన్ని బయటకు వస్తాయన్నారు. నా ఫోనుకు బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నా ఫోన్ నాకు ఇవ్వాలని అడుగుతాను కాబట్టి వాళ్లే మళ్లీ రివర్స్‌లో తననే ఫోన్ అడుగుతున్నారని అన్నారు.
అప్పుడు రేవంత్ అరెస్ట్.. ఇప్పుడు..
సీఎం కేసీఆర్‌కు బలగం సినిమా చూపించాలన్నారు. కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ఎక్కువయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి సమయంలో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు మా అత్తగారి దినకార్యం రోజే తనను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మానవత్వం లేని కేసీఆర్ కు బలగం చిత్రాన్ని అంకితం చేయాలన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ, కాగజ్ పూర్ పేపర్ మిల్లు తెరవమంటే ఎందుకు తేరుస్తలేవంటూ ప్రశ్నించారు. ఇక్కడ చేయలేక పోయిన కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్లి ఏం చేస్తారు. కన్న తల్లి కి తిండి పెట్టలేని కేసీఆర్.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా ఉందన్నారు.
బలగం సినిమాపై ప్రశంసలు..
బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ బలగం సినిమా చూశారు. బలగం అద్భుతంగా ఉందన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని దర్శకుడు వేణు ఈ సినిమా తీయడం గర్వంగా ఉందన్నారు. సనాతన ధర్మంలోని గొప్పదనాన్ని చిత్రం చక్కగా చూపించారన్నారు. ఎవరైనా చనిపోతే 11 రోజులపాటు కార్యక్రమాలు చేసుకోవడం ప్రస్తుతం అలవాటుగా మారిందన్నారు. కానీ ఆ పద్దతిని సంప్రదాయంగా చూపించిన వేణుకు హాట్సాప్ అని ప్రశంసించారు.
పిట్టముట్టడం అనేది మన సంప్రదాయం అని.. పిట్టముట్టుడు పద్దతిని చాలా సంప్రదాయంగా చూపించారు. నిర్మాతలు, దర్శకులు బలగం చిత్రాన్ని వ్యాపార కోణంలో తీయలేదని అర్థమవుతుందన్నారు. బలగం ఓటీటీలో కాదు థియేటర్లలోనే చూడాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. వేణుకు ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదని.. తెలంగాణ సమాజం కోసం వేణు బలగం తీశాడని అన్నారు. దర్శకుడు వేణు, నటీనటులకు నా అభినందనలు తెలిపారు బండి సంజయ్.
ఇది అభివృద్ది కాదా…
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవని ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ లో బిడ్డింగ్ ఎలా చేస్తుంది? సింగరేణిలో 27వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారని.. డబుల్ బెడ్ రూములకు, ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవనే సీఎం… విశాఖలో బిడ్డింగ్ ఎలా చేస్తుంది? కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదన్న మంత్రులు కంటివెలుగులో ఆపరేషన్ చేయించుకోవాలని ఎద్దేవ చేశారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం ఎందుకు రాలేదన్నారు. ఈ నెల 15న వరంగల్ లో వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ చేస్తామన్నారు. వరంగల్ సీపీ రంగనాథ్ ఫోన్ కాల్ లిస్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
