Farmers: పాపం రైతన్న.. జింక పేరు వింటే చాలు హడలిపోతున్నారు.. అంతలా భయపడటానికి కారణమేంటంటే..

Farmers: తెలంగాణలోని నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని రైతులు జింకల పేరు వింటేనే భయపడిపోతున్నారు. కాపాడండి బాబోయ్ అంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు.

Farmers: పాపం రైతన్న.. జింక పేరు వింటే చాలు హడలిపోతున్నారు.. అంతలా భయపడటానికి కారణమేంటంటే..
Deers
Shiva Prajapati

|

Oct 23, 2021 | 5:32 AM

Farmers: తెలంగాణలోని నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని రైతులు జింకల పేరు వింటేనే భయపడిపోతున్నారు. కాపాడండి బాబోయ్ అంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. అన్ని శక్తులను అడ్డుకుంటున్నాం కానీ, ఈ జింకల నుంచి అడ్డుకోలేకపోతున్నామంటూ వాపోతున్నారు. ఇంతకీ జింకలకు రైతన్నలు ఎందుకు భయపడుతున్నారో తెలుసా. వేల రూపాలయ పెట్టుబడులు పెట్టి పంటచేలు వేస్తే.. ఆ పంట చేలలో చెంగు చెంగున ఎగురుకుంటూ పంటలను నాశనం చేస్తున్నాయి. దాంతో అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వివరాల్లోకెళితే.. నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మక్తల్, ఊట్కూరు, నర్వ, మాగనూర్, కృష్ణా మండలాల్లో జింకలు కర్షకుడి కంట నీరు తెప్పిస్తున్నాయి. పొలాల్లో చెంగుచెంగున ఎగురుతూ పంటలను నష్టం కలిగిస్తున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.

పంటలను పశువుల నుంచి కాపాడుకుంటున్నా .. జింకలు బెంబేలెత్తిస్తున్నాయని రైతులు అంటున్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో వానాకాలం సీజన్‌లో పత్తి, కంది, ఆముదం తదితర పంటలను సాగు చేశారు రైతులు. చాలామంది పత్తి పంట వైపే మొగ్గుచూపుతున్నారు. రూ. వేలల్లో పెట్టుబడులు పెట్టారు. పంటలు మొలక దశలో ఉన్నపుడు మందలుగా వచ్చి పొలాలపై దాడి చేస్తున్నాయి. దీంతో పంటలు మొదటి దశలోనే ధ్వంసమవుతోంది. కంటికి రెప్పలా పంట చేతికొచ్చే వరకు కాపాడిన కూడా పత్తి కాయలను, కంది బుడ్డలను సైతం వదలడం లేదు అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వాటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన మాగనూరు, కృష్ణా మండలాల్లోనే కాకుండా మక్తల్, ఊట్కూరు, నర్వ పరిధిలోనూ జింకలు గుంపులుగా సంచరిస్తున్నాయి.

ఆయా మండలాల్లో వేల ఎకరాల్లో వానాకాలం ఆరుతడి పంటలు సాగు చేశారు రైతులు. ఈ పంటలను నాశనం చేస్తున్న జింకలను తరలించేలా చర్యలు తీసుకోవాలని, తాము నష్టపోకుండా చూడాలని రైతులు కోరారు. ఉమ్మడి మాగనూరు మండలంలో వరి సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతుండటంతో జింకలు మెట్ట ప్రాంతాలవైపు వస్తున్నాయని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఊట్కూరు, మక్తల్, నర్వ మండలాల్లోని గ్రామాల్లో ఏటేటా జింకల సంతతి పెరుగుతోంది. మందలుగా వచ్చి పొలాల్లో తిరుగుతూ.. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో పాటు కూరగాయల తోటలనూ నాశనం చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. నష్టపోయిన స్థానంలో మరోమారు మొక్కలను విత్తడం భారంగా మారుతోందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Also read:

IPL 2022: ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..! షారుఖ్, ప్రీతిజింటాల‌కు గ‌ట్టి పోటీ..

Deepika Pilli: చిలకపచ్చ ఓణీతో పరువాల వల వేస్తున్న వయ్యారి భామ దీపికా పిల్లి..

Rashmi Gautam: నిషా కాళ్ళ రష్మీ .. అందాల ఆడబొమ్మ ఎంతబాగుంది ముద్దుగుమ్మ అంటూ పాటలు పడుతున్న కుర్రకారు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu