AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda: వీడ్ని వయసు పైబడిన పెద్దమనిషి అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే కాండ్రించి ఊస్తారు..

సమాజంలో నానాటికి మహిళలు ముఖ్యంగా చిన్నారులపై అఘాత్యాలు పెరిగిపోతున్నాయి. కీచకుల కామానికి అభం శుభం తెలియని చిన్నారులు బలి అవుతున్నారు. చిన్నారిని చిదిమేసిన ఓ కామాంధుడికి నల్లగొండ జిల్లా ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Nalgonda: వీడ్ని వయసు పైబడిన పెద్దమనిషి అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే కాండ్రించి ఊస్తారు..
Ushayya
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 16, 2025 | 6:30 PM

Share

ఈ ఫోటో కనిపిస్తున్న వ్యక్తిని వయసు పైబడిన పెద్దమనిషి అనుకునేరు..  అసలు విషయం తెలిస్తే కాండ్రించి ఊస్తారు. అభం, శుభం తెలియని మైనర్ బాలికను చెరబట్టాడు ఈ దుర్మార్గుడు.  నల్లగొండ జిల్లా అన్నెపర్రి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య పనులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ 10 ఏళ్ల మైనర్ బాలిక 28 మార్చి 2023న ఇంట్లో నిద్రిస్తోంది. బాలిక ఒక్కతే ఉండటం గమనించిన ఊషయ్య.. ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న బాలికను లేపి చాక్లెట్లు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని కూడా బెదిరించాడు.

తర్వాత విషయం తెలుసుకున్న బాధిత బాలిక తల్లి 29 మార్చి 2023 న నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి చార్జిషీట్ వేశారు. ఇరు వర్గాల వాదనను కోర్టు విన్నది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. నిందితుడు దారుణానికి ఒడిగట్టినట్లు ధర్మాసనం గుర్తించింది. ఇలాంటివారికి కఠిన శిక్ష విధించాలని భావించింది. దీంతో 60 ఏళ్ల ఊశయ్యకు 24 ఏళ్ల జైలు శిక్షతో పాటు 40 వేల రూపాయల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సోకోర్టు జడ్జి రోజా రమణి సంచలన తీర్పు ఇచ్చారు. బాధిత బాలికకు 10 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని కోర్టు తమ తీర్పులో ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్