AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలు.. విజేతలకు భారీగా ప్రైజ్‌మనీ.. దరఖాస్తు, అర్హతల వివరాలివే

బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఫెస్టివల్ ను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. త్వరలోనే ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana: బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలు.. విజేతలకు భారీగా ప్రైజ్‌మనీ.. దరఖాస్తు, అర్హతల వివరాలివే
Telangana Bathukamma Film Challenge
Basha Shek
|

Updated on: Sep 16, 2025 | 8:10 PM

Share

తెలంగాణ‌లోని యువ కళాకారులకు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాల‌కు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు.

పోటీలకు సంబంధించిన అర్హతలు :

1.ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

2. వీడియో 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.

3. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.

4.మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.

5.బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి

పోటీల్లో ఎంపికైన విజేతలకు ప్రైజ్ మనీ ఇలా..

  • ప్ర‌థ‌మ బ‌హుమ‌తి – రూ.3 ల‌క్షలు
  • ద్వితీయ బ‌హుమ‌తి – రూ.2 ల‌క్ష‌లు
  • తృతీయ బ‌హుమ‌తి – రూ.1 ల‌క్ష‌
  • కన్సోలేష‌న్ బ‌హుమ‌తి – రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వ‌డంతో పాటు విజేత‌లంద‌రికీ ప్ర‌శంసా ప‌త్రం, జ్ఞాపిక ప్ర‌దానం చేస్తారు.

నిర్దేశిత గడువులోగా వచ్చిన‌ ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపిక‌లు పూర్తి చేస్తుంది.

ఎంట్రీల‌ను youngfilmmakerschallenge@gmail.com కు పంపగలరు (లేదా) వాట్సాప్ నెంబర్ – 8125834009 (WhatsApp Only)కు పంపాలి. ఎంట్రీల‌ను పంపించేందుకు తుది గ‌డువు సెప్టెంబ‌రు 30, 2025గా నిర్ణయించారు. 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .