జెట్ స్పీడ్‌తో ఏపీలోకి ఎంటరయిన కారు.. చెక్ చేయగా.. బయటపడ్డ లోగుట్టు యవ్వారం

| Edited By: Ravi Kiran

Nov 17, 2024 | 11:21 AM

సాధారణంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మోసం చేస్తుంటారు. మరికొందరు స్కీములు, చిట్టిల పేరుతో జనానికి కుచ్చుటోపి పెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకు ఎన్నో పథకాలు వేస్తారు.

జెట్ స్పీడ్‌తో ఏపీలోకి ఎంటరయిన కారు.. చెక్ చేయగా.. బయటపడ్డ లోగుట్టు యవ్వారం
Ap News
Follow us on

సాధారణంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మోసం చేస్తుంటారు. మరికొందరు స్కీములు, చిట్టిల పేరుతో జనానికి కుచ్చుటోపి పెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకు ఎన్నో పథకాలు వేస్తారు. ఐపీ పెడుతుంటారు. కానీ ఈ కిలాడీ దంపతులు.. ఐపీ పెట్టి బాధితుల నుంచి తప్పించుకునేందుకు పెంపుడు కుక్కలతో ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఎస్ జెన్కో కార్యాలయంలో శ్రీనివాసరావు ఆర్టిజన్‌గా పనిచేస్తున్నారు. సాగర్‌లోని పైలాన్ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసరావు, భార్య లక్ష్మీ పద్మావతి.. స్థానికులకు తలలో నాలుకలా ఉంటున్నారు. అందరితో నమ్మకంగా ఉంటూ కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. జెన్కో ఉద్యోగులతో పాటు స్థానిక వ్యాపారులు, పలువురు ప్రైవేట్ ఉద్యోగులు వారి వద్ద నెలనెలా చిట్టీలు కట్టారు. రెండేళ్లుగా చిట్టీలు పాడినవారికి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. నగదు ఇవ్వకుండా ప్రామిసరీ నోట్లు రాసిస్తూ, త్వరలో ఇస్తామంటూ నమ్మిస్తూ వచ్చారు. 80 లక్షల వరకు ఈ కిలాడీ దంపతులు స్థానికులకు కుచ్చుటోపి పెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

చిట్టీ డబ్బులు అడిగేందుకు ఇంటికి వస్తున్న స్థానికులపై పెంపుడు కుక్కలతో దాడి చేయిస్తున్నారు. పెంపుడు కుక్కలను వదలడంతో స్థానికులు, బాధితులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కోర్టుకు వెళ్లి ఐపీ పెట్టి చిట్టీలు వేసినవారికి నోటీసులు పంపారు. దీంతో జెన్కో ఉన్నతాధికారులు ఈ నెల 11వ తేదీన ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పెంపుడు కుక్కలతో పాటు ఏపీకి పారిపోతుండగా బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద కిలాడీ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో 40 మంది నుండి చిట్టీల ద్వారా డబ్బుల మోసం చేసినట్లు అంగీకరించారు. ఆ నగదుతో కారు, బంగారం కొనుగోలు చేసినట్లు చెప్పారు. కారు, బంగారం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, బ్యాంక్ పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకుని కటకటాల పాలు చేసినట్టు సిఐ బీసన్న తెలిపారు.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..