Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రూప్ వన్ జనరల్ ర్యాంకుల్లో మెరిసిన నల్లగొండ తేజం.. ఐఏఎస్ కావాలనే ఆకాంక్షతో..

వెంకట రమణ గ్రూప్ వన్ ను మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటాడు. వెంకటరమణ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. తండ్రి శ్రీనివాసరావు నల్గొండలో టీఎస్ స్ఈడ బ్ల్యూఐడీసీ ఏఈగా, తల్లి రమాదేవి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మొదటి నుండి చదువులో చురుకుగా ఉండేవెంకటరమణ వరంగల్ నీట్ లో బిటెక్ సిఎస్సి పూర్తి చేశాడు. ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే గత ఆరేళ్లుగా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన జూనియర్ లెక్చరర్ సివిక్స్ పోస్టుకు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు.

గ్రూప్ వన్ జనరల్ ర్యాంకుల్లో మెరిసిన నల్లగొండ తేజం.. ఐఏఎస్ కావాలనే ఆకాంక్షతో..
Group One General Ranks
Follow us
M Revan Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Mar 31, 2025 | 12:07 PM

రాష్ట్రంలో 563 గ్రూప్ వన్ సర్వీస్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో మరోసారి నల్లగొండ జిల్లా వాసులు ప్రతిభ కనబరిచారు. జనరల్ మెరిట్ టాప్ లో నల్లగొండ ముద్దుబిడ్డలు నిలిచారు. గ్రూప్ వన్ జనరల్ ర్యాంక్స్ లో సెకండ్ టాపర్ గా నల్గొండకు చెందిన వెంకటరమణ నిలిచాడు.

రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షలు నల్లగొండ అభ్యర్థులు ముందంజలో ఉంటారు. తాజాగా ప్రభుత్వం గ్రూపు – 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంక్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఫలితాల్లో నల్లగొండకు చెందిన దాది వెంకట రమణ రెండో స్థానంలో నిలిచారు. నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్రంలో రెండో స్థానం సాధించారు. వెంకట రమణ గ్రూప్ వన్ ను మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటాడు. వెంకటరమణ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. తండ్రి శ్రీనివాసరావు నల్గొండలో టీఎస్ స్ఈడ బ్ల్యూఐడీసీ ఏఈగా, తల్లి రమాదేవి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మొదటి నుండి చదువులో చురుకుగా ఉండేవెంకటరమణ వరంగల్ నీట్ లో బిటెక్ సిఎస్సి పూర్తి చేశాడు. ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే గత ఆరేళ్లుగా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన జూనియర్ లెక్చరర్ సివిక్స్ పోస్టుకు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రూప్-2లో 378వ ర్యాంకు సాధించారు.

ఐఏఎస్ కావాలని ఆకాంక్ష..

ఇవి కూడా చదవండి

గత ఆరేళ్లుగా సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న వెంకటరమణ.. ఇంటి వద్దే ఉండి సన్నద్ధమవుతూ గ్రూప్-1 మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటాడు. అమ్మానాన్నల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని వెంకటరమణ తెలిపారు. సమాజ సేవ చేయాలనే ఆకాంక్ష తన లక్ష్యసాధనకు దోహదపడిందని చెప్పారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..