Nagarjuna Sagar Dam: పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో నాగర్జున సాగర్.. ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో భారీగా వస్తుండటంతో సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి

Nagarjuna Sagar Dam: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో భారీగా వస్తుండటంతో సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4,72,708 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 40,625 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 586.70 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0404 టీఏంసీలుగా కాగా.. ప్రస్తుతం 3.3.94 టీఏంసీలుగా ఉందని అధికారలు వెల్లడించారు. సాగర్ కు భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..