Munugodu Bypoll: టీఆర్ఎస్‌లో ‘మునుగోడు’ రచ్చ.. సీఎం సభకు ముందు ముదురుతున్న అసమ్మతి రాగం..

Munugodu Bypoll: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషనే రాలేదు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం పీక్స్‌కు చేరింది. ఈ పంచాయితీ అధినేత వరకు వెళ్లినా..

Munugodu Bypoll: టీఆర్ఎస్‌లో ‘మునుగోడు’ రచ్చ.. సీఎం సభకు ముందు ముదురుతున్న అసమ్మతి రాగం..
Trs
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 12, 2022 | 9:40 PM

Munugodu Bypoll: మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషనే రాలేదు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం పీక్స్‌కు చేరింది. ఈ పంచాయితీ అధినేత వరకు వెళ్లినా.. ఇంకా చల్లారడం లేదు. తాజాగా చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ వద్ద కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. కూసుకుంట్లకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం సభలోనే మునుగోడు టికెట్‌ను ప్రభాకర్ రెడ్డికి ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ మీటింగ్ గులాబీ పార్టీలో కలకలం రేగుతోంది. టీఆర్‌ఎస్‌ టికెట్‌‌ను కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వొద్దని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజా సమావేశంలో తీర్మానం చేశారు. ఆ కాపీని పార్టీ హైకమాండ్‌కు పంపించారు నేతలు.

ఇదిలాఉంటే.. ఈ అసమ్మతి నేపథ్యంలో ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగింపులు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. ఓవైపు సీఎం సభకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు కూసుకుంట్ల వ్యతిరేక కూటమి ఏకమవుతోంది. కాగా, మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే కారణం అని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. బరిలో కూసుకుంట్ల ఉండే గెలువరనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. తన కోవర్టులతో మునుగోడు టీఆర్ఎస్‌లో డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వద్ద గెలిచి పార్టీలోకి వచ్చిన కొందరు అలజడి సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు టిఆర్ఎస్ నేతలు. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. ఫంక్షన్‌ అని టీఆర్‌ఎస్‌ నేతలను ఆహ్వానించి, అసమ్మతి మీటింగ్ గా కలరింగ్‌ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి. మునుగోడు టిఆర్‌ఎస్‌ ఏలాంటి అసమ్మతి లేదని, అందరూ ఒకేతాటిపై ఉన్నారని స్పష్టం చేశారు మంత్రి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?