AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కన్నబిడ్డను బస్టాండ్‌లో వదలేసి.. ప్రియుడితో వివాహిత జంప్

ప్రియుడి కోసం కన్నబిడ్డను నల్గొండ బస్‌స్టాండ్‌లో వదిలేసి వెళ్లిన తల్లిని ఇప్పుడు అందరూ తిట్టిపోస్తున్నారు. . ఇన్‌స్టా పరిచయంతో మాయలో పడిన ఆమె.. 15 నెలల బాబును అనాధలా వదిలేసి, ప్రియుడితో జంప్ అయ్యింది. సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన పోలీసులు చివరకు బాలుడిని తండ్రికి అప్పగించారు.

Telangana: కన్నబిడ్డను బస్టాండ్‌లో వదలేసి.. ప్రియుడితో వివాహిత జంప్
Women Elope
Ram Naramaneni
|

Updated on: Jul 27, 2025 | 5:32 PM

Share

వివాహ బంధానికి రోజురోజుకు బీటలు వారుతున్నాయి. మద పిచ్చితో మాతృత్వానికి మచ్చ తెస్తున్నారు కొందరు. ఇంత ఘాటైన పదం వాడినందుకు క్షమించండి.. కానీ పరిస్థితులు అలానే దిగజారిపోతున్నాయి. రోజుకో వరస్ట్ వార్త వినాల్సి వస్తుంది. ప్రియుడు తనవెంట రమ్మని చెప్పడంతో కన్నబిడ్డను దిక్కు లేని అనాధగా నల్గొండ బస్‌స్టాండ్‌లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి.. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక.. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న 15 నెలల చిన్నోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో.. వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించారు. ఆమె భర్తను పిలిపించి.. బిడ్డను ఆయనకు అప్పగించారు. ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్ స్టాండ్‌లో చోటు చేసుకుంది.

నల్లగొండ పాతబస్తీకి చెందిన ఒక యువకుడితో.. హైద్రాబాద్‌కు చెందిన వివాహితకు ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆమెకు భర్త, 15 నెలల బాబు ఉన్నారు. వారిని వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది. డైరెక్ట్‌గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌కు బాబుతో పాటు వచ్చి.. చిన్నోడిని అక్కడే వదిలేసి వదిలేసి ఆ యువకుడితో జంప్ అయింది. బాబు తప్పిపోయాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు.. బస్టాండ్‌లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. బైక్ మీద వెళుతున్న మహిళ వీడియోను చూసి.. ఆ బాలుడు తన తల్లిని గుర్తించాడని పోలీసులు తెలిపారు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా.. విచారణ చేపట్టిన పోలీసులకు.. బైకు యజమాని నుంచి అతని ఫ్రెండ్ వెహికిల్ తీసుకెళ్లినట్లు తేలిందట. విచారణ చేయగా.. వారి ఇన్ స్టా లవ్ స్టోరీ బయపడింది. అనంతరం.. మహిళను, ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని.. ఆమె భర్తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చి.. భర్తకు అంటే బాలుడు తండ్రికి పిల్లాడిని అప్పగించారు. ఇది ప్రస్తుతం పరిస్థితి.. ఇంకా మున్ముందు ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.