MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు.. 26న హాజరవ్వాలంటూ..
Delhi Excise policy case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు కలకలం రేపుతోంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో.. ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు. ఈ స్కామ్‌లో ఆమె చుట్టూ ఆనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఓవైపు ఈడీ విచారణ.. మరోవైపు కవిత న్యాయపోరాటం కొనసాగుతోంది. ఇప్పుడు సీబీఐ నుంచి కూడా కవితకు నోటీసులు అందాయి.

Delhi Excise policy case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు కలకలం రేపుతోంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో.. ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు. ఈ స్కామ్‌లో ఆమె చుట్టూ ఆనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఓవైపు ఈడీ విచారణ.. మరోవైపు కవిత న్యాయపోరాటం కొనసాగుతోంది. ఇప్పుడు సీబీఐ నుంచి కూడా కవితకు నోటీసులు అందాయి. ఈ నెల 26న విచారణకు రావాలంటూ సీబీఐ బుధవారం నోటీసులు పంపింది. మరి ఈ విచారణకు కవిత వెళ్తారా? లేదా ?.. నోటీసులకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలోనూ కవితను సీబీఐ ప్రశ్నించింది. 2022 డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ.. సుమారు ఏడు గంటలపాటు ఆమెను ప్రశ్నించింది. సీఆర్‌పీసీ 160 కింద ఆమె స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే అప్పుడు ఇంటి దగ్గర స్టేట్‌మెంట్ తీసుకున్న సీబీఐ.. ఈ సారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠ రేపుతోంది.
మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైన కవిత
ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ విచారించింది. అయితే, నాలుగోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చాక.. సుప్రీంను ఆశ్రయించారామె. మహిళను ఈడీ ఆఫీస్‌కు ఎలా పిలుస్తారంటూ పిటిషన్ వేశారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. లిక్కర్ స్కామ్‌లో తనను ఇరికించే కుట్ర చేస్తున్నారంటూ కవిత ఆరోపిస్తున్నారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కానీ 26నే విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది.
వీడియో చూడండి..
కోర్టులో పిటిషన్ కారణంగా ఈడీ విచారణకు దూరంగా కవిత
కోర్టులో విచారణ ఉందంటూ ఇప్పటికే ఈడీ విచారణకు కవిత దూరంగా ఉంటున్నారు. కోర్టులో కేసు తేలిన తర్వాతే ఈడీ విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈడీ నోటీసులకు కూడా ఇదే సమాధానం ఇచ్చారామె. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు కవిత వెళ్తారా… లేదా.. ? అన్నది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
